Friday

అల్లర్లతో ఇరాక్ అతలాకుతలం

* తాజా హింసలో 18మంది మృతి
* దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఘర్షణలు 


అల్లర్లతో ఇరాక్ అతలాకుతలం అవుతోంది. దేశంలో తాజాగా చెరేగిన హింసలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దియాలా రాష్ట్రంలోని ఖాలీస్ మార్కెట్ ప్రాంతంలో జరిగిన కారు బాంబు పేలుడులో పది మంది మృతి చెందగా, ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో చోట చెలరేగిన ఘర్షణల్లో మరో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. అల్లర్లు క్రమంగా దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. దీంతో పోలీసులు భద్రత పెంచారు. అల్లరి మూకలను చెదరగొట్టడానికి సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.

0 comments:

Post a Comment