Friday

నాటో దాడులపై తాలిబన్ల ఫైర్‌

* అమెరికాను తప్పుబట్టిన టెర్రరిస్ట్‌లు 

పాక్ సైనికులపై నాటో దాడుల ఘటన మరో మలుపు తిరుగుతోంది. ఈవిషయంలో పాక్‌కు తాలిబన్లు మద్దతు పలుకుతున్నారు. పాక్ సైనికులు మరణించడటం పట్ల విచారం వ్యక్తం చేసిన తాలిబన్లు, ఈ ఘటనకు అమెరికాయే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పాక్-ఆఫ్గన్‌ బోర్డర్‌లో శనివారం నాటో దళాలు జరిపిన దాడుల్లో 24 మంది పాక్ సైనికులు మృతిచెందారు. ఈ ఘటన అమెరికా- పాకిస్తాన్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

0 comments:

Post a Comment