Friday

మరింత క్షీణించిన జీడీపీ వృద్ధి రేటు

* జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి 6.9 శాతంగా నమోదు 

జీడీపీ వృద్ధి రేటు మరింత మందగించింది. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి గాను జీడీపీ వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదై 9 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. గత ఏడాది ఇదే సమయంలో జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతంగా నమోదైంది. రోజురోజుకు పెరుగుతోన్న ద్రవ్యోల్బణం రేటు, అధిక వడ్డీరేట్లు, బలహీనపడిన రూపాయి, పారిశ్రామిక ఉత్పత్తి రేటు క్షీణించటంతో జీడీపీ వృద్ధి రేటు ఒక్కసారిగా తగ్గిందని కేంద్రం ప్రకటించింది.

0 comments:

Post a Comment