Friday

దిగివస్తున్న బంగారం, వెండి ధరలు

* ఎంసీఎక్స్‌లో 10 గ్రా. బంగారం రూ.28,650, కిలో వెండి రూ.55,500 

డాలర్‌ ఒక్కసారిగా బలపడుతుండటంతో బంగారం, వెండి ధరలు వరుసగా మూడో రోజు కూడా దిగివస్తున్నాయి. యూరో ఆరు వారాల కనిష్టానికి పడిపోవడంతో డాలర్‌ రేటు క్రమక్రమంగా బలపడుతుండటంతో ట్రేడర్లు గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ నుంచి డాలర్‌ వైపు దృష్టి సారించారు. దీంతో ఇవాళ ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 150 రూపాయలు తగ్గి 28 వేల 650 రూపాయలకు పడిపోయింది. ఇక కిలో వెండి ధర ఏకంగా 15 వందల రూపాయలు తగ్గి 55 వేల 5 వందల రూపాయలు పలుకుతోంది. 

0 comments:

Post a Comment