రోజూ విటమిన్ మాత్రలు వేసుకుంటున్నారా? నీరసం పోగొట్టుకోడానికి వాటిపైనే ఆధారపడుతున్నారా? అయితే దాంతో ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. మల్టీవిటమిన్ మాత్రలు మింగితే డబ్బు వృథా చేసుకున్నట్లేనని ఫ్రాన్స్‌లోని నాన్సీ యూనివర్సిటీ నిపుణులు అంటున్నారు. ఎనిమిది వేల మందిపై ఆరేళ్లపాటు అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని «ద్రువీకరించారు.
ఆరోగ్యంపై ఆందోళన చెందేవారు, విటమిన్ మాత్రలు తమను అనారోగ్యం నుంచి కాపాడతాయని భావించే వారే వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నారని పరిశోధకులు గుర్తించారు. అల్జీమర్స్, గుండెపోటు రాకుండా వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారన్నారు. అనేక మంది విటమిన్ మాత్రలను అనవసరంగా ఉపయోగిస్తున్నారని, వీటితో పెద్దగా దుష్ప్రభావం లేకపోయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చారు.

0 comments:
Post a Comment