Wednesday

త్వరలో హైడ్రోజన్ బ్యాటరీలు...!


 ఇకపై లాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను తరచుగా చార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు! బ్యాటరీ ఎప్పుడు అయిపోతుందోనన్న బెంగ కూడా అక్కర్లేదు. ప్రఖ్యాత యాపిల్ కంపెనీ ఈ చింత తీర్చడానికి ప్రయత్నిస్తోంది. హైడ్రోజన్ బ్యాటరీలతో ఈ సమస్యను దూరం చేయడానికి కృషి చేస్తోంది. 

హైడ్రోజన్ ఇంధనంతో బ్యాటరీలు రోజుల తరబడి నిలిచి ఉంటాయని, వాటి పరిమాణం కూడా తగ్గుతుందని ఆ సంస్థ చెబుతోంది. దీని పేటెంట్ కోసం యాపిల్ కంపెనీ ఇప్పటికే అమెరికాలో దరఖాస్తు చేసుకుంది. ఈ బ్యాటరీలు హైడ్రోజన్, ఆక్సిజన్‌ను నీరు, విద్యుత్‌గా మార్చుతాయని, పైగా ఇది కాలుష్య రహితమని 'యాపిల్' తన దరఖాస్తులో వివరించింది.

0 comments:

Post a Comment