Wednesday

విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు...


గ్రహాంతర జీవులపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేస్తున్న పరిశోధన కు గట్టి ఊతం లభించింది. భూమి తరహా గ్రహాల కోసం విశ్వాన్ని గాలిస్తున్న నాసాకు సౌర కుటుంబం ఆవల రెండు గ్రహాలు చిక్కాయి. కెప్లర్ మిషన్‌లో భాగంగా వీటి ఆచూకీ చిక్కింది. ఈ గ్రహాలు సూర్యుణ్ని పోలిన నక్షత్రం చుట్టూ తిరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటికి కెప్లర్-20ఇ, కెప్లర్-20ఎఫ్ అని పేరుపెట్టారు.

సూర్యుని వంటి నక్షత్రానికి సమీపంలో భూ పరిమాణం లో ఉన్న గ్రహాలను గుర్తించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో విశ్వంలో భూమి తరహా గ్రహాలు అనేకం ఉన్నాయన్న వాదనను ఇది «ద్రువీకరిస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కెప్లర్-20ఇ వ్యాసం భూమి కంటే 3శాతం ఎక్కువగా ఉండగా, కెప్లర్-20ఎఫ్ వ్యాసం 15శాతం తక్కువగా ఉందని నాసా పేర్కొంది. నక్షత్రానికి సమీపం లో ఉన్నందున వీటి ఉపరితలంలో నీరు ఉండే అవకాశం ఉందని నాసా భావిస్తోంది. ఈ గ్రహాలపై ఉన్న ఉష్ణోగ్రత జీవం మనుగడకు అనుకూలంగా ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 'నేచర్' జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. కెప్లర్ టెలిస్కోప్ ఆధారంగా ఈ గ్రహాలను గుర్తించగలిగారు.

కెప్లర్ 20 వ్యవస్థలో మూడు ఇతర గ్రహాలను కూడా కనుగొన్నారు. ఈ ఐదు గ్రహాలు సూర్యుణ్ని పోలిన నక్షత్రం చుట్టూ తక్కువ దూరాల్లో నిర్ణీత కక్ష్యలో తిరుగుతున్నాయని, అవి వేర్వేరు సైజుల్లో ఒక క్రమబద్ధంగా అమరి ఉన్నాయని ఖగోళ నిపుణులు విశ్లేషించారు. ఈ నక్షత్ర వ్యవస్థపై కెప్లర్ టెలిస్కోప్ దృష్టి సారించిందని, భవిష్యత్తులో దీనిపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. నక్షత్రానికి గ్రహాలు అడ్డుగా వచ్చినపుడు వెలుగు తగ్గిపోతుంది. ఈ తేడాలను గుర్తిస్తూ కెప్లర్ మిషన్‌లోని నిపుణులు కొత్త గ్రహాల ను కనిపెడుతున్నారు. ఈ మిషన్‌లో భాగంగా ప్రస్తు ్తతం దాదాపు లక్షా 50వేల నక్షత్రాలను పరిశీలిస్తున్నారు.

0 comments:

Post a Comment