Sunday

ఇండోనేసియా తీరంలో ఓడ మునిగి 200 మంది గల్లంతు 33 మంది ప్రయాణికులు క్షేమం...


ఇండోనేసియా సముద్రతీరంలో ఓడ ఒకటి శనివారం మునిగిన సంఘటనలో 200మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. అధికారులు చేపట్టిన సహాయకచర్యల్లో 33 మందిని రక్షించారు. అఫ్ఘానిస్థాన్, ఇరాన్, ఇరాక్, టర్కీలో ఆర్థికపరిస్థితులు దిగజారడంతో అనేకమంది ఉపాధి వెతుక్కుంటూ తగిన ఆశ్రయం కోసం ఆస్ట్రేలియా బయలుదేరారు. శనివారం వీరంతా ఓడలోకి ఎక్కారు. ఈ ఓడ జావా ద్వీపం తీరానికి 32 కిలోమీటర్ల దూరంలో మునిగింది.

సామర్థ్యానికి మించి రెండింతల మంది ప్రయాణికులు ఎక్కడంతో ప్రమాదానికి గురైందని అధికారులు భావిస్తున్నారు. ఈ నౌకలో 40 మంది పిల్లలు ఉన్నారని అంచనా. ప్రయాణికుల జాడ కోసం అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. కాగా, గతనెలలో 70 మంది శరణార్థులతో బయలుదేరిన ఓడ ఒకటి జావా దక్షిణ తీరంలో తల్లకిందులైన సంఘటనలో 8 మంది మరణించారు.

0 comments:

Post a Comment