Sunday

మధుమేహం వివిధ రకాల పరీక్షలు

పరగడుపున (ఫాస్టింగ్‌)
dayabetsఈ పరీక్షకోసం ఉదయం లేస్తూనే 6-8 గంటల మధ్య శాంపిల్‌ ఇవ్వాలి. రాత్రంతా పడుకుని ఉంటాము కాబట్టి ఉదయాన లేవగానే రక్తంలో గ్లూకోజ్‌ స్థిరంగా ఉంటుంది. ఆ సమయంలో పరీక్ష చేయించుకోవటమే మంచిది.అంతకుముందు రోజు రాత్రి భోజనం 8-10 గంటల మధ్య మామూలుగానే తీసుకోవాలి.ఉదయాన రక్తం శాంపిల్‌ ఇచ్చేంతవరకు పాలు, కాఫీ, టీ, పళ్ళరసం లేక పళ్ళు, సిగరెట్‌, అల్కహాల్‌లాంటివేమీ తీసుకోకూడదు. మంచినీళ్ళు మాత్రం తీసుకోవచ్చు. ఉదయాన వ్యాయామాలు చేసే అలవాటుంటే వాటిని చేయకూడదు.రాత్రి ఆహారం తీసుకున్న దగ్గరి నుంచి 12 గంటలలోపున రక్తం శాంపిల్‌ ఇవ్వాలి.

ఈ పరీక్షలో రక్తంలోని 100 యం.జి./డి.ఎల్‌ (మిల్లీగ్రామ్‌ పర్‌ డెసిలీటర్‌) కంటే తక్కువ ఉండాలి.100-125 మధ్య ఉంటే మధుమేహం రావటానికి అవకాశం ఉందని గుర్తించాలి.ఈ స్థితిని ఇమ్‌పేయిర్డ్‌ గ్లూకోజ్‌ టాలరెన్స్‌ అంటారు.ఈ పరీక్ష కోసం డాక్టరు సూచనల ప్రకారం ఉదయం టిఫిన్‌ చేసిన రెండు గంటల తర్వాతగాని, లేక మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన రెండుగంటల తర్వాతగాని రక్తం శాంపిల్‌ ఇవ్వాలి.మామూలుగా రోజువారీ తినే భోజనమే తీసుకోవాలి. అయితే ఒకటి, ఆహారం తీసుకున్న తర్వాత నుంచి శాంపిల్‌ ఇచ్చేంతవరకూ మధ్యలో అంటే ఆరెండు గంటల కాలంలో ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు.అదే విధంగా ఈ రెండు గంటల కాలంలో ఎలాంటి వ్యాయామాలూ చేయకూడదు.ఈ పరీక్షలో రక్తంలోని గ్లూకోజ్‌ 200 యం.జి./డి.ఎల్‌ కంటే ఎక్కువ ఉండకూడదు.

రాండమ్‌ బ్లడ్‌ గ్లూకోజ్‌
Diabetరక్తంలో గ్లూకోజ్‌ పరిమాణం ఏ స్థాయిలో ఉన్నదన్నది అర్జెంటుగా తెలుసుకోవాలనుకున్నప్పుడు రాండమ్‌ బ్లడ్‌ గ్లూకోజ్‌ పరీక్ష చేస్తారు.రక్తం పరగడుపున ఇవ్వటం, ఆహారం తీసుకున్న తర్వాత ఇవ్వటం వంటి నియమమేమీ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేయటం ఈ పరీక్ష.ఈ పరీక్ష వల్ల మధుమేహం ఏ స్థాయిలో ఉన్నదన్నది ఉజ్జాయింపుగా మాత్రమే తెలుస్తుంది.రాండమ్‌ బ్లడ్‌ గ్లూకోజ్‌ 180 యం.జి. % లోపు ఉండా‚లి.

గ్లైకోసిలేటెడ్‌ హీమోగ్లోబిన్‌ టెస్ట్‌
గడచిన మూడునెలలుగా రక్తంలో గ్లూకోజు నియంత్రణలో ఉంటోందా లేదా అన్నది తెలి సేందుకు ఈ పరీక్ష ఒక్కటే ఆధారం.‘షుగర్‌’ను అదుపులో ఉంచుకునేందుకు గత మూడు నెలలుగా తీసుకుంటున్న మందు లు, చర్యలూ నిజమైన ఫలితాన్నిస్తున్నాయా లేదా అన్నది ఈ పరీక్షలో తెలిసిపోతుంది.దీని ఫలితాన్ని బట్టి ఇప్పుడు వాడుతున్న మందులు సరిపోతాయా లేక మార్చుకోవాల్సిన అవసరం ఉందా అన్నది తెలుసుకోవటానికి వీలు కుదురుతుంది.కొంతమంది షుగర్‌ పరీక్ష చేయించు కోవటానికి ముందురోజు మాత్రమే మందులు సరి గ్గా వేసుకుని ఆహారనియమాలు మరింత కట్టు దిట్టంగా పాటిస్తారు.

దానివల్ల ఆ మరుసటి రోజు పరీక్షలో షుగర్‌ (గ్లూకోజు) తాత్కాలికంగా తక్కువగా కనపడవచ్చు.
ఇలాంటివారికి వాస్తవంగా గత మూడు నెలలుగా రక్తంలో గ్లూకోజ్‌ సగటున ఎంత ఉంటోందన్నది ఈ పరీక్ష ద్వారా కచ్చితంగా తెలుస్తుంది.దీనికోసం రోజులో ఎప్పుడైనా ఏ సమయంలోనైనా రక్తం శాంపిల్‌ ఇవ్వవచ్చు.చాలాకాలంనుంచి రక్తంలో షుగర్‌ చాలా ఎక్కువగా ఉన్నా, మందులు వాడుకోకపోయినా, మందుల మోతాదు సరిపోకపోయినా, దీర్ఘకాలంలో బ్లడ్‌ షుగర్‌‌‌ స్థాయి తెలుసుకోవాలని అనుకుంటున్నా ఈ పరీక్ష చేయించుకోవటం ఉత్త మం.
రక్తంలో గ్లైకోసిలేటెడ్‌ హీమోగ్లోబిన్‌ 7% లోపు ఉండాలి. (4-7% మధ్య ఉండటం ఆదర్శనీయం)

ఓరల్‌ గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్‌ 
Diaపరగడుపున, ఆహారం తీసుకున్న తర్వాత చేసే పరీక్షల్లో విషయం స్పష్టంగా తేలక, మధు మేహం రిస్కుకు దగ్గరగా ఉన్నట్లు అనుమానం ఉన్నవాళ్ళకు చేసే టెస్ట్‌ ఇది.డయాబెటిస్‌ (మధుమేహం) ఉందా, లేదా అనే సందేహనివృత్తికి ఇది బాగా ఉపయోగ పడుతుంది.దీనికోసం ముందుగా పరగడుపున రక్తం శాంపిల్‌ ఇవ్వాలి. ఆ తర్వాత వెంటనే పెద్దవా రికి 75 గ్రాముల గ్లూకోజ్‌ పౌడరును, పిల్లలకు వాళ్ళ బరువునుబట్టి కేజీకి 1.75 గ్రాముల చొప్పున గ్లూకోజును రెండు మూడు గ్లాసుల నీటిలో కలిపి తాగిస్తారు.తర్వాత అవసరాన్నిబట్టి వెంటనే అరగంటకోసం చొప్పున రెండుగంటలపాటు రక్తం, మూత్రాలను సేకరించి పరీక్షిస్తారు. ఇందులో నార్మల్‌ వస్తే మధుమేహం లేన ట్టేనని నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ గ్లూకోజు ఎక్కువగా ఉంటే మున్ముందు మధుమేహం వచ్చే అవకాశాలున్నట్లుగా భావించాలి.

0 comments:

Post a Comment