Friday

ఆపిల్ మినీ ఐప్యాడ్ వచ్చేస్తోంది...!


ఆపిల్ ఐప్యాడ్ అంటే మీకిష్టమా? కానీ ధర చూసి ‘అబ్బో! ఇది మన కోసం కాదులే’ అనుకుంటున్నారా? అయితే ఇంకొక్క నెల ఆగండి... మీరూ ఈ టెక్నాలజీ అద్భుతాన్ని ఆస్వాదించవచ్చు. టాబ్లెట్ ప్రపంచంలో పెరిగిపోతున్న పోటీని తట్టుకునేందుకు ఆపిల్ మినీ సైజులో సరికొత్త ఐప్యాడ్‌ను అందించబోతోంది మరి. అంతకంటే ముందు సెప్టెంబరు 12న ఐఫోన్ తాజా వెర్షన్‌ను విడుదల చేస్తామని ఆ తరువాత అక్టోబరు నెలలో ఐప్యాడ్ మినీ విడుదల ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. 

ఆపిల్ కంపెనీ తయారుచేసే ఉత్పత్తులు డిజైన్ పరంగా ఎంత ముద్దుగా ఉన్నప్పటికీ ధర మాత్రం సామాన్యులకు అందుబాటులో లేనంతగా ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో గూగుల్ నెక్సస్-7 పేరుతో, అమెజాన్ కిండల్ ఫైర్, శాంసంగ్ గెలాక్సీ పేరుతో చిన్న ట్యాబ్లెట్లను విడుదల చేయడంతో ఆపిల్ కూడా ఈ దిశగా అడుగులేయడం మొదలుపెట్టింది. తాజా అంచనాల ప్రకారం ఐప్యాడ్ మినీ దాదాపు ఎనిమిది అంగుళాల స్క్రీన్‌సైజుతో లభ్యం కానుంది. ధర రూ.11 వేల నుంచి రూ.16 వేల లోపే ఉండవచ్చునని అంచనా. నెక్సస్-7, కిండల్‌ఫైర్‌ల మాదిరిగానే ఎనిమిది గిగాబైట్ల ఇంటర్నర్ మెమరీతో లభిస్తుందని భావిస్తున్నారు. ఐప్యాడ్‌కు ఉండాల్సిన మిగిలిన అన్ని హంగులూ మినీలోనూ ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు!

0 comments:

Post a Comment