Wednesday

'ప్లీహం'ఎందుకు ఉపయోగపడుతుంది?



మన శరీరం ఒక యంత్రం లాంటిది. దీనిపైన సరే! లోపల ఎన్నో రకాల అవయవా లుంటాయి. అవి ఒక్కొక్కటి కొన్ని విధులను నిర్వహిస్తూ ఉంటాయి. అటువంటి వాటిల్లో ''ప్లీహం'' (రజూశ్రీవవఅ) ఒకటి.
మనలోపల ఎడమ వైపు ''హైపో కాండ్రియం ''ఉన్నది. దానిలోపల ఉదరవితానం'' (డయాఫ్రం) కింద, పొత్తి కడుపు కుహరానికి ఎడమ పక్క ఉంటుంది. ''పెరిటోరియం'' దీని చుట్టూ పొరలాగా అమరి ఉంటుంది.
ముదురు ఎరుపు రంగులో ముద్దలాగా వుంటుంది. ఇందులో నుండి రక్తనాళాలు, నాడులు వెళ్తాయి. పెద్దవారిలో ఇది 200గ్రాముల బరువు ఉంటుంది. కణజాలం రెండు రకాలుగా వుంటుంది. ఒకటి ఎర్రగుజ్జు, రెండవది తెల్లగుజ్జు. ''పిలంట్లు'' అనే తేలికపాటి రంగుఉన్నవి వుంటాయి. ఇవి''లింఫాయిడ్‌'' కణజాలంతో కూడి వుంటాయి. ''లింపోసైట్‌'' లు అనే వాటిని వుత్పత్తి చేస్తాయి. రక్తాన్ని వడగడుతుంది. రక్తాన్ని నిలువ వుంచుతుంది. రక్తంలో ఎర్రరక్త కణాలు వున్నాయనుకున్నాం !వాటి జీవితకాలం 120 రోజులు. అంటే ఎల్లప్పుడూ నశిస్తూనే వుంటా యన్నమాట. ఆరోగ్యవంతుల శరీరంలో ప్రతి సెకనుకు 10మిలియన్ల ఎర్రరక్తకణాలు నాశన మవుతూ ఉంటాయట. ఇలా నాశనమైన వాటి విచ్చిత్తి దీనిలోనే జరుగుతుంది.
మన శరీరంలో రక్తం నిలువ ఉండే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అలాగే ప్లీహం కూడా చెప్పుకోదగినంత రక్తం నిలువ ఉంచు తుంది. ఇది అత్యవసర సమయంలో ఉపయోగించ బడుతుంది. నరాలు చిట్లి రక్త స్రావం' జరుగు తుందనుకోండి దీని వలన రక్తాన్ని నష్టపోతారు. అలా నష్టపోయిన రక్త నష్టాన్ని పూడ్చేందుకు దీనిలోని రక్తం ఉపయోగపడుతుందన్నమాట. రక్తంలోకి అతి సూక్ష్మజీవులు చేరుతూ ఉంటాయి. వాటిని తొలగించి వేస్తుంది. రక్తానికి సరిపడని ఇతర పదార్థాలపై చర్యతీసుకుంటుంది. ఇలా దీనిపనులు ఎన్నో ! 

0 comments:

Post a Comment