ప్రపంచంలో మానవత సమాజంసమూల పరివర్తనకు లోనైతే విజ్ఞాన రంగంలో కూడా విప్లవాత్మకమార్పులు రావడ అనివార్యం ఆధునిక యుగంలో అటువంటి వైజ్ఞానిక విప్లవానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి నికొలస్‌కొపర్నిక్. ఆయన విశ్వానికి భూమి కేంద్రమన్నప్పుడు భావన వుండేది. ఖగోళశాస్త్రంలో 1300ఏళ్ళ పాటు ఆ సిద్ధాంతానిదే రాజ్యమై మతభావాలు పెరిగి వైజ్ఞానిక శాస్త్రాల ప్రగతికి అడ్డంకిగా నిలిచాయి. భూమి చుట్టూ సూర్యుడు ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని అరిస్టాటిల్ కాలంనుంచి క్రీస్తుశకం రెండో శతాబ్దంలో టాకెమి సైతం సమర్థించడం విశేషం. కొపర్నికస్ ఈ మూఢనమ్మక సిద్ధాంతాల్నీ వ్యతి రేకించి సూర్యుడు చుట్టు భూమితోపాటు ఇతర గ్రహాలు తిరుతున్నాయన్న సిద్ధాంతాన్ని ప్రతి పాదించాడు. కొపర్నిక్ 1473 ఫిబ్రవరి 19న పొలెండ్‌లోని ఊరూన్ జన్మించాడు. పదేళ్ల వయసులోనే తల్లి, దండ్రి మరణించడంలో మేనమామ లుకాన వాజెన్ రోజ వద్ద తన మిగతా ముగ్గురు సోదరులు పెరిగారు. లుకాస్ వాజ్‌న్ రోమంచి విద్యావేత్త దర్మశాస్త్రంలో బొలొగ్గా యూని వర్శిటీనుంచి ఆయన డాక్టరేట్ పొంది, పర్షియాలో బిషప్‌గా నియమితుడయ్యాడు. హోదాతోపాటు డబ్బు పుష్కలంగా ఉండడంతో విద్యాభ్యాసంలో కొపర్నికస్ ఆయన ప్రోత్సాహించాడు. ...యూనివర్శిటో రెండెళ్లు చదివి 22ఏళ్ల వయసు లోనే ప్రంబర్క్ చర్చిలో మతాధికారి ఉద్యోగం కొపర్నికస్ పొందడం జరిగింది. కచర్చిలో ఉద్యోగం ఉన్నప్పటికీ విద్య తృష్ణతో మరో 12ఏళ్ల పాటు విద్యను కొనసాగించాడు. ఈ నేపథ్యంలో యూరప్ అంతటా కొత్తమార్గాలు, ప్రాంతాల అన్వేషణ సైన్స్, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రాలను పెద్ద ఎత్తున చర్చిస్తున్న సమయం. నాడు కొత్తవైద్యం, తత్వ శాస్త్రం రోమన్‌చట్టాన్ని కూడా అధ్యయనం చేశాడు.1496 బోలాగ్నా తర్వాత పడువా, ఫెరార యూనివర్శీటీల్లో కళ, తత్వ శాస్త్రాలపై తన అభిప్రాయుఆలను లేఖల రూపంలో రాసి వాటినేకరపత్రాల్లా తన సహచరు లకు పంచిపెట్టాడు. ఇంతలో బోలోగ్నా ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త డొమనికా మరియాడా నోవా సాంగత్యం లభంచండంతో వారి వద్ద ఖగోళ పరిశోధనలు కిటుకులు కొపర్నికస్ తెలుసు కున్నారు. లూకెమి సిద్దాంతాల్లో వాస్తవికతను మన్నించడమే కాక ప్రత్యామ్నాయ సిద్ధాంతాల కోసం అన్వేషణ ప్రారంభించాడు. ధర్మ శాస్త్రంలో డాక్టరేట్ పొంది 1503 లో ఫ్రంబర్గ్‌కి కొపర్నికస్ వెళ్లినప్పుడు మేనేమా ఆనారోగ్యం పాలుకావడం తో 1506నుంచి 1512వరకు ఆయన దగ్గరే వుంటూ టాలెమి ప్రతిపాదనలను వంద సార్లు పరిశీలించి తర్వాతన సూర్యకేంద్ర సిద్దాంత చిత్తు ప్రతిని కొపర్నికస్ తయారు చేశాడు. 1514లో తన సిద్దాంతం సారాంశాన్ని కొందరి మిత్రులకి అంద జేశారు. దాన్నే తర్వాత ఆన్‌ది...... గ్రంథంలో తెలియజేశారు. ఫ్రంబర్గ్‌కి వచ్చిన తర్వాత తన ఇంటిపై కప్పుపై ప్రయోగశాలను ఏర్పాటు చేసుకొని ఖగోళ పరిశీలనలు జరిపారు. తన ప్రతిపాదనలను రకరకాల కోణాల నుంచి తార్కికంగా పరిశీలించాడు. చివరి తన సిద్ధాంతమే వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్న నిర్ణయానికి ఆయన వచ్చాడు. ఒక చంద్రుడు మాత్రం భూమిచుట్టూ తిరుగుతున్నాడని అభిప్రాయాన్ని ప్రతిపాదిం చాడు. సూర్యకేంద్ర సిద్ధాంతానికి ఆకర్షితుడైన జర్మనీ గణిత శాస్త్రజుడు రెటిక్ ఎంతో బతిమి లాడినా తన సిద్దాంతాలను పుస్తకరూపంలో ప్రచు రించడానికి అంగీకరించలేదు. చివరికి రెటికస్ స్వయంగా 1540లో కోపొర్నిక్ సిద్దాంతా లను సంక్షిప్తం చేసి ప్రచురించారు. కాథలిక్ చర్చి ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందన్న భయంతో ఎప్పటికప్పుడు తన పుస్తక ప్రచు రణకు వాయిదా వేసుంఊట చివరికి ఎలాగై నాతేనేం అంగీకరిం చాడు. తన గ్రంథం ప్రెస్ నుండి వచ్చిన రోజు 1543మే 24న కొపర్ని కస్ మరణించాడు. గ్రహాల సంఖ్య వాటి భ్రమణం గురించి కొపర్నికస్ ప్రతిపాదనలు సంపూర్ణం కావు. కొపర్నికస్‌వే కాక పశుశాస్త్రవేత్త ప్రతిపాదనలు అంతిమ సత్యాలు కావు.. విజ్ఞాన శాస్త్రంలో అంతిమ సత్యాలకు తావు లేదు.. ఫ్రెంచ్ గణిత శాస్త్రకర్త పోయన్ కరే అన్నట్లు ఒక పరికల్పనపై(హైపో థీసెస్) తర్వాత మరొక పరి కల్పన సాయంతో శాస్త్ర వేత్తలు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. విజ్ఞానశాస్త్ర గమనం తీరే అది.ఏది ఏమైనా వేళకాని వేళల్లో ..దారికాని దారుల్లో కానరాని కాంక్షలతో ఖగోళ శాస్త్రం 'గ్రహబలం'మార్చిన కొపర్నిక్ పేరు భూమి ఉన్నంతవరకు శాశ్వతంగా నిలిచిపోతుంది.
0 comments:
Post a Comment