నిగూఢమైన సైన్సు విషయాలను సరళమైన భాషలో ప్రజలకు అర్థమయ్యేటట్లు వ్రాయడం ద్వారానే సైన్సు పురోగతి మరింత సులభసాధ్యమవుతుంది. సైన్సు సైన్సు కొరకే కాదు, సైన్సు ప్రజలకోసం, ప్రజల భవిష్యత్తును ఉజ్జ్వలం చేసే విధంగా సైన్సుప్రగతి ఉండాలి. 20వ శతాబ్దంలో రెండు ప్రపంచయుద్ధాల సైన్సు ప్రగతి కారణంగానే దారుణ మారణహోమానికి తోడ్పడ్డాయి. అలాకాక, సైన్సు మానవ కళ్యాణానికి, జ్ఞానతృష్ణను తీర్చుకోవడానికి, సైన్సుకు మూలమైన శాస్త్రీయ పద్ధతిని ప్రజలు అలవరచుకోవడానికి సైన్సు జ్ఞానం సామాన్యుని వరకూ చేరాలని తపనతో కృషిచేసిన వివిధ రంగాల శాస్త్రజ్ఞులు వున్నారు. బర్నాల్ వ్రాసిన హిస్టరీ ఆఫ్‌సైన్సు వంటివి ఆ రంగంలో ఒక ముందడుగు.
వినీల ఆకాశంలో సుదూర నక్షత్రాల తీరుతెన్నుల గురించి, ఖగోళ శాస్త్ర రహస్యాలను సైన్సు లేబరేటరీల వరకే పరిమితం చేయకుండా ఖగోళ శాస్త్రాన్ని - సామాన్య మానవునికి అర్థమయ్యేటట్లు అహర్నిశలూ కృషి చేసిన గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు కార్ల్ సాగన్.
కార్ల్ ఎడ్వర్డ్ సాగన్ 1934 నవంబరు 9న న్యూయార్క్ పట్టణంలోని బ్రూక్లిన్‌లో జన్మిం చాడు. అతను అమెరికన్ ఆస్ట్రానమర్, ఆస్ట్రోఫిజినిస్ట్, కాస్మోలజిస్ట్, సైన్స్‌కమ్యూనికేటర్, అంతేకాదు. సైన్సు పరిజ్ఞానాన్ని సామాన్యుల వరకూ తీసుకువెళ్ళాలని నిరంతరం తపన చెందిన విశిష్టవ్యక్తి.
పాపులర్ సైన్స్ పుస్తక రచయితగా ప్రపంచ ప్రసిద్ధిచెందారు. 1980లో టెలివిజన్ సీరిస్‌లో Cosmos: A personal voyage అన్నది విశ్వవిఖ్యాతి చెందింది. అవార్డులు, రివార్డులు అందుకొంది. సాగన్ వ్రాసిన కాస్మోస్ పుస్తకం ప్రఖ్యాతి చెందింది. అతను వ్రాసిన కాంటాక్ట్ అనే నవల ఒక ఫిల్మ్‌గా వచ్చింది. అతని రచనలకు, సినిమాలకు, టెలివిజన్ కార్యక్రమాలకు ఎన్నో ప్రఖ్యాత అవార్డులు వచ్చాయి. ఇంటింటికీ ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర రహస్యాలను ఛేదించి, విజ్ఞాన వీచికలు, ప్రసరింపచేసి, నూతన చైతన్యానికి, ఆలోచనకు అతను మార్గదర్శకు డయ్యాడు. సాగన్ అజ్ఞేయవాది. మూఢనమ్మకా లను, అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని దశదిశలా వ్యాప్తి చెయ్యడానికి అవిరళ కృషి సల్పారు. రష్యాలో ఉక్రేనియన్ ప్రాంతంనుండి అమెరికా కి వలస వచ్చిన ఒక యూదు కుటుంబంలో జన్మించి, అమెరికాలో చాలా దారిద్య్రాన్ని, కష్టాల కడలిని దాటుకొని, తన అఖండిపజ్ఞతో ముందుకుసాగాడు. ప్రశ్నించడం, పరిశీలించడం, పరిశోధించడం, కార్మికుడైన తన తండ్రి నుండి అలవర్చుకున్నాడు. 1939లో న్యూయార్క్ వరల్డ్‌ఫేర్‌లో ప్రదర్శించిన విషయాలు అతని జీవనగతిని, జీవిత లక్ష్యాలను మార్చివేశాయి. ''భవిష్యత్తులో అమెరికా'' అన్న ప్రదర్శన అతనిని మంత్రముగ్ధుని చేసింది. పట్టుదల, దీక్ష అతనికి మారుపేరు అయ్యాయి. ఖగోళశాస్త్రంలో డాక్టరేట్ పొందాడు. హార్వర్డ్‌లో రీసెర్చి చేశాడు. కార్నేల్ యూనివర్శిటీలో ప్రఖ్యాత ప్రొఫెసర్ అయ్యాడు. కార్నేల్‌లో రేడియో ఫిజిక్స్, స్పేస్ రీసెర్చి సెంటర్ అసోసియేట్ డైరెక్టర్ అయ్యాడు. అమెరికా అంతరిక్ష పరిశోధనలో నాసా సెంటరులో స్పేస్ ప్రోగ్రాంలో ఆదినుండీ ముఖ్యుడయ్యాడు. అంతర్ గ్రహవాసులు ఎవరైనా వున్నారా అని పరిశోధన చేశాడు. 62 సంవత్సరాల వయస్సులో 1996లో డిసెంబరు 20న కాన్సర్, న్యూమోనియాతో మరణించేవరకూ కార్నెల్ యూనివర్శిటీలో క్రిటికల్ థింకింగ్ బోధించేవాడు.
వీనస్‌గ్రహంపై శీతోష్ణస్థితిని పరిశోధించాడు. 'ప్లానెట్స్' అనే టైమ్-లైఫ్ పుస్తకం వ్రాశాడు. 1994లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అతనికి మానవ కళ్యాణానికి సైన్స్ అన్న కృషికి బంగారుపతకం ప్రదానం చేశారు. సాగన్ రూపొందించిన కాస్‌మాస్ విశ్వరహస్యాలు ఛేదించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన టెలివిజన్ సీరియల్. 60దేశాలలో 50కోట్లమందికి పైగా ప్రజలు దానిని ఆసక్తితో చూశారు. ఇంక ఏ గ్రహంలోనైనా జీవులు ఉన్నాయా అన్న శాస్త్రీయ అన్వేషణకు పూనుకున్నాడు. అతను ప్లానిటరీ సొసైటీ స్థాపించాడు. దానిలో 149 దేశాల నుండి లక్షమంది సభ్యులు వున్నారు. ఖగోళ శాస్త్ర రంగంలో అతను ఎన్నో పుస్తకాలు రచించాడు. అవి బహుళ ప్రచారం పొందాయి. 'బిలియన్స్ అండ్ బిలియన్స్ ' అన్నది అతని చివరి పుస్తకం. క్షితిజంలో కోట్లకోట్ల నక్షత్రాలు వున్నాయని ఎంతో విజ్ఞానదాయకంగా వ్రాశాడు. ''ఈ విశ్వంలో ఉన్న నక్షత్రాలు ఈ భూగోళంలో అన్ని సముద్రతీరాలలో వున్న బీచ్‌లలో వున్న ఇసుక రేణువుల కంటే అధికం'' అని పేర్కొన్నాడు.
సంఘదృష్టి, సామాజిక స్పృహ లేని టెక్నాలజీ, నాగరికతలు తమకు తాము నాశనం చేసుకొంటాయని హెచ్చరించాడు. వియత్నాం యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అణు యుద్ధం, నక్షత్రయుద్ధంని సాగన్ వ్యతిరేకించాడు. 'న్యూక్లియర్ హాలోకాస్ట్' సర్వనాశనానికి దారి తీస్తుందని, అగ్రరాజ్యాల మధ్య అణ్వాయుధాల పోటీ, అమెరికన్ అధ్యక్షుడు రీగన్ కోరే నక్షత్రయుద్ధాలు విశ్వనాశనానికి దారితీస్తాయని తీవ్రంగా వ్యతిరేకించాడు. నక్షత్రయుద్ధం అణు నిరాయుధీకరణకు హానికరం అని తీవ్రంగా ఖండించాడు. 1985లో గోర్బచెవ్ అణ్వాయుధా లను పరీక్షించేది లేదని ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ప్రకటించినా, రీగన్ ఆ అణుపరీక్షలు ఆపకపోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేస్తూ, అణ్వస్త్ర పరీక్షల ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలలో పాల్గొన్నందుకు కార్ల్ సాగన్‌ను, ఇతరులను అమెరికా ప్రభుత్వం రెండుసార్లు అరెస్టు చేసింది. అఖండ ప్రజ్ఞావంతుడు, మేధావి, సైన్సు-శాస్త్రీయ దృష్టి, సామాజిక స్పృహ కొరకు తన జీవితాన్ని అర్పించిన కార్ల్ సాగన్‌కు ఎన్నో అవార్డులు వచ్చాయి. నాసా(అమెరికన్ స్పేస్ ఏజెన్సీ) అతనిని డిస్టింగ్విష్‌డ్ పబ్లిక్ సర్వీస్ మెడల్‌తో సత్కరించింది. అతని రచన డ్రాగన్స్ ఆఫ్ ఈడెమ్ పులిటిక్ ప్రైజ్ వచ్చింది. డిస్కవరీ ఛానల్ అతనిని గ్రేటెస్ట్ అమెరికన్ అవార్డుతో సత్కరించింది. అతని రచన, టెలివిజన్ కార్యక్రమం కాస్‌మాస్‌కి ఎన్నో అవార్డులు వచ్చాయి. ఐసాక్ అసిమోవ్ అవార్డు, జాన్ ఎఫ్ కెన్నడీ అవార్డు, హ్యూగో అవార్డు - మరెన్నో అతని కీర్తి కిరీటాన్ని దేదీప్యమానం చేశాయి. ప్రఖ్యాత హ్యూమనిస్టు అవార్డు అతనికి లభించింది. అతని జీవిత గాథలేకాక,‘Carl Sagan The People’s Astronomer’ అని డేవిడ్ మారిసన్ పుస్తకం వ్రాశాడు. సాగన్ రచనా సామర్థ్యం అనన్య సామాన్యమైనది. ప్రజల మనిషి. ప్రజల మధ్య, ప్రజలలో, ప్రజాసంక్షేమానికై జీవితాంతం కృషిచేసిన మహామేధావి సాగన్.
కార్ల్‌సాగన్ ప్రీథింకర్, హ్యూమనిస్టు, రేషనలిస్టు, సమాజంపై, సైన్స్‌పై మతం పెత్తనాన్ని, దైవభావాన్ని తిరస్కరించాడు.‘Extraordinary claims require extraordinary evidence’ అని తన‘Cosmos’ పుస్తకంలో వ్రాశాడు.
కార్ల్ సాగన్ కుమారుడు నిక్‌సాగన్Star Trek లో ఎన్నో ఎపిసోడ్స్ వ్రాశాడు. కార్ల్‌సాగన్ వ్రాసిన Cosmos ఆధారంగాsymphony of Science అని ్‌శీబ ుబbవ లో విశాల ''విశ్వసంగీత'' అంతరిక్ష ధ్వనులను రెండుకోట్లకి పైగా ప్రజలు చూడటం సాగన్ కృషికి నివాళిగా మారింది.
సైన్సు పరిశోధన ప్రజలకోసం, ప్రగతికోసం సైన్సు, మానవ కళ్యాణానికి అన్న సందేశాన్ని, విశ్వవ్యాప్తం చేసిన ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు కార్ల్ సాగన్. యువతరం, నవతరం హృదయాలలో, శాంతి కాముకుల శాంతియుత ప్రయత్నాలలో, సత్యా న్వేషణలో సజీవంగా వున్నాడు. ూశీజూబశ్రీaతీ ూషఱవఅషవ కి దిశానిర్దేశన చేసిన మహనీయుడు, ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు కార్ల్‌సాగన్.
0 comments:
Post a Comment