వర్షాలు మొదలయ్యాయి... వంటింట్లో నుంచి మసాలా ఘుమఘుమలు బయటికి వస్తుంటాయి. మసాలా పేరు చెప్పగానే ముందు గుర్తొచ్చేది చికెన్. చికెన్ మాట వినిపించగానే గుర్తొచ్చేది చికెన్ బిర్యాని, చికెన్ కూర, వేపుడు. ఇవన్నీ కామన్ కాబట్టి కొన్ని వెరైటీ చికెన్ వంటకాలను పరిచయం చేస్తోంది ఈ వారం వంటిల్లు.
చికెన్ రోల్స్..
కావలసిన పదార్థాలు: చికెన్ - అర కిలో, మైదా పిండి - అరకిలో, ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు, పచ్చిమిరపకాయలు - నాలుగు, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు టీ స్పూన్లు, గరం మసాలా - అర టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, కొత్తిమీర తురుము - అర కప్పు, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. తరువాత ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి కలపాలి.
ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన చికెన్ వేసి సన్నని మంటపై వేగించాలి. చివర్లో కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి దించేయాలి. మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూను నూనె, కొద్దిగా నీళ్లు పోసి చపాతి పిండిలా కలుపుకుని చపాతీలు చేసుకోవాలి. చపాతి మధ్యలో ఒక టేబుల్ స్పూను చికెన్ వేపుడు పెట్టి నాలుగు వైపులా మడత వేసి గొట్టంలా చుట్టుకోవాలి. మడత ఊడిపోకుండా ఉండడానికి జారుగా కలుపుకున్న మైదా పిండిని మడత దగ్గర పూయాలి. ఈ రోల్స్‌ని నూనెలో వేగించుకోవాలి. చికెన్‌రోల్స్ రెడీ అయినట్టే.
చికెన్ బాల్స్...
కావలసిన పదార్థాలు: చికెన్ - అరకిలో, బ్రెడ్ ముక్కలు - ఐదు, గుడ్లు - రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు టీ స్పూన్లు, వార్‌సెస్టర్ సాస్ - రెండు టేబుల్ స్పూన్లు, పసుపు - చిటికెడు, కారం - అర టీ స్పూను, మిరియాల పొడి - ఒక టీ స్పూను, అజీనమోటో - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. తయారుచేయు విధానం: బోన్‌లెస్ చికెన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కుక్కర్‌లో చికెన్, ఉప్పు, కారం, పసుపు, ఒక టీ స్పూను అల్లంవెల్లుల్లి ముద్ద, కొద్దిగా నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి. ఇంతలో రెండు బ్రెడ్ ముక్కల్ని నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన చికెన్‌లో నానిన బ్రెడ్ ముద్ద, మూడు బ్రెడ్ ముక్కల పొడి, కోడిగుడ్ల సొన, మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్ద, సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఈ బాల్స్ వేసి వేగించి తీసేయాలి.
మ్యాంగో చికెన్...
కావలసిన పదార్థాలు: చికెన్ - అర కిలో, మామిడి పండు గుజ్జు - ఒక కప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను, మొక్కజొన్న పిండి - రెండు టేబుల్ స్పూన్లు, సోయా సాస్ - రెండు టీ స్పూన్లు, ఫిష్ సాస్ - అర టీ స్పూను, చిల్లి సాస్ - ఒక టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగినీరు పోయాక ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మామిడిపండు గుజ్జు, అల్లంవెల్లుల్లి, మొక్కజొన్నపిండి, సోయా సాస్, ఫిష్ సాస్, చిల్లీ సాస్, చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో చికెన్ వేసి ఒక పావుగంటసేపు నానబెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఈ చికెన్ ముక్కలు వేసి వేగించుకోవాలి.
డోనట్స్...
కావలసిన పదార్థాలు: చికెన్ - అరకిలో, మైదా పిండి - ఒక కప్పు, బ్రెడ్ పొడి - అర కప్పు, బంగాళదుంపలు - రెండు, కోడి గుడ్లు - రెండు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిరపకాయలు - ఆరు, మిరియాల పొడి - ఒక టీ స్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు టీ స్పూన్లు, బేకింగ్ పౌడర్ - ఒక టీ స్పూను, పసుపు - చిటికెడు, కొత్తిమీర కట్ట - ఒకటి, కరివేపాకు - ఒక రెబ్బ, గరం మసాలా - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: చికెన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. మరో గిన్నెలో బంగాళదుంప ముక్కల్ని ఉడికించుకోవాలి. చికెన్ చల్లారాక అందులో కోడిగుడ్ల సొన, బ్రెడ్ పొడి, మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, బేకింగ్ పౌడర్, ఉప్పు , పసుపు, కొత్తిమీర తురుము, కరివేపాకు, మిరియాల పొడి, ఉడికించిన బంగాళ దుంపముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. బాగా జారుగా ఉంటే ఒక టేబుల్ స్పూను శెనగపిండి కలుపుకోవచ్చు. దీంతో గారెలు చేసి నూనెలో వేగించి తీసేయాలి.
థాయ్ చికెన్ వింగ్స్..
కావలసిన పదార్థాలు: చికెన్ (పెద్ద ముక్కలు) - అర కిలో, మొక్కజొన్న పిండి - ఒక టేబుల్ స్పూను, కారం - రెండు స్పూన్లు, పెరుగు - అర కప్పు, తేనే - రెండు టీ స్పూన్లు, నిమ్మకాయ రసం - ఒక టేబుల్ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా చికెన్ ముక్కల్ని కుక్కర్‌లో ఒక విజిల్ వచ్చేవరకూ ఉడికించుకోవాలి. ఒక గిన్నెలో పెరుగు, తేనే, నిమ్మకాయ రసం, ఉప్పు, కారం, మొక్కజొన్న పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఉడికించిన చికెన్ ముక్కలు వేసి పదినిమిషాలు ఉంచాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి రెండేసి చికెన్ ముక్కలు వేసి ఎర్రగా వేగించి తీయాలి.

0 comments:
Post a Comment