Friday

శ్రీశైలం ఆలయానికి స్వయం ప్రతిపత్తి...!

శ్రీశైలానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు రాయలసీమ మంత్రులు, ఇతర నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అంశంపై రాయలసీమకు చెందిన ఓ మంత్రి ఇటీవల దేవాదాయ శాఖకు లే ఖ రాశారు. నల్లమలలో కొలువైన శ్రీశై లం మల్లన్న ఆలయానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరారు. కర్నూలు, కడప, మహబూబ్‌నగర్, ప్రకాశం జిల్లాల్లోని శివాలయాలు, ఇతర గుడులనుమల్లన్న ఆలయ నియంత్రణలోకి తీసుకొస్తూ పాలనాపరంగా స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలిసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనరేట్‌లో ఫైలు కదిలింది.

స్వయం ప్రతిపత్తి ఎలా ఇవ్వాలి? ఇందుకు ఎదురయ్యే అడ్డంకులు ఏమిటి? తదితర అంశాలపై ఇప్పటికే కొంత సమాచా రం సేకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం దేవాదాయ శాఖ నియంత్రణలో నడుస్తున్న ఈ ఆలయంలో వందల మంది ఉద్యోగులు నిరంతరం భక్తులకు సేవలందిస్తున్నారు. అసిస్టెంట్ కమిషనర్ కేడర్ అధికారి కార్యనిర్వహణాధికారి (ఈవో)గా పని చేస్తున్నారు. దీనికితో డు, శ్రీశైలానికి నలుదిక్కులా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని నల్లమల అ డవుల్లో దాదాపు 120కిపైగా శివాలయాలున్నాయి. వీటిలో 28 పెద్ద ఆలయాలు. వీటన్నింటి పాలన వ్యవహారాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నేతలు కోరుతున్నారు. దీనివల్ల పా లన పరంగా సౌలభ్యం ఉంటుందని, ఆలయాల అభివృద్ధి జరుగుతుందని, భక్తులకు మేలైన సదుపాయాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియ అం త సులువుగా ముందుకు సాగేది కాద ని అధికార వర్గాలు చెబుతున్నాయి. తి రుమల తిరుపతికి, శ్రీశైలం ఆలయాని కి మధ్య ప్రత్యేక తేడా ఉంది. తిరుమల లో పూర్తిస్థాయి అధికారం అక్కడి ఈ వోకే ఉంటుంది. ఆలయ ఆలనా పాల నా, పౌర సేవలు, భక్తుల సేవలు, మౌ లిక వనరులు, రక్షణ వ్యవస్థ, అటవీ సంరక్షణ తదితర విభాగాలపై ఈవోకే పూర్తి అధికారం ఉంటుంది. ప్రభుత్వం లో ముఖ్య కార్యదర్శి స్థాయి ఐఏఎస్ అ ధికారి టీటీడీకి ఈవోగా ఉన్నారు.

ఆ త ర్వాత మరో ఇద్దరు జూనియర్ ఐఏఎస్ లు వివిధ హోదాల్లో సేవలందిస్తున్నా రు. ఇక్కడ తిరుమలేశుడి ఆలయాలు, భక్తుల సేవ తప్ప మరొకటి ఉండదు. కానీ శ్రీశైలంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ఇక్కడ ఆలయాలతోపాటు సాధారణ పౌర జీవనం ఉంది. ప్రభు త్వ వ్యవస్థలున్నాయి. రాజకీయాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి ఏ ప్రాతిపదికన స్వయం ప్రతిపత్తి కల్పించాలనే మీమాంస అధికారుల్లో మొదలైంది. స్వయం ప్రతిపత్తి ఇవ్వాలంటే.. శ్రీశైలంలో సర్వాధికారాలు ఈ వోకు ఇవ్వాల్సి ఉంటుంది. అడవులు, నీటిపారుదల, విద్యుత్, పౌర వ్యవస్థ, రోడ్లు, భవనాలు తదితరాలు అన్నిటిపై నా నియంత్రణాధికారం ఈవోకు ఇవ్వా లి. ఇది సాధ్యమేనా అన్న అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ప్రభు త్వం తలచుకుంటే ప్రత్యేక చట్టం తీసుకొచ్చి స్వయం ప్రతిపత్తి ఇవ్వొచ్చని అధికారులు చెబుతున్నారు.

0 comments:

Post a Comment