గత నవంబర్‌లో పాకిస్థాన్ సైనికులపై నాటో దళాలు చేసిన దాడి అమెరికాకు 'ఖరీదైన తప్పిదం'గా మారింది. నాటి నాటో దాడిలో 24 మంది పాక్ సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. నాటి నుంచీ పాకిస్థాన్ తమ భూభాగం గుండా నాటో దళాల సరఫరాలను నిలిపేసింది. అయితే 2014లో అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. దానికయ్యే ఖర్చు తడిపి మోపెడు కానుంది.
ఒక కంటెయినర్‌ను పాకిస్థాన్ భూభాగం గుండా తరలించడానికి అమెరికాకు 7నుంచి 8 వేల డాలర్ల ఖర్చయ్యేది. అదే వాయుమార్గం ద్వారా తరలించడానికి సుమారు మూడు రెట్లు.. అంటే 20 వేల డాలర్ల వరకూ ఖర్చవుతోంది. దీనికి కారణం.. ఈ తరలింపు కోసం అమెరికా సాలెగూడులాంటి నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటోంది. ప్రస్తుతం అమెరికా తన దళాలకు అందిస్తున్న సరఫరాలు.. లాత్వియా, లిథువేనియా, రష్యా, ఉజ్బెకిస్థాన్, జార్జియా సహా సుమారు పన్నెండు దేశాల గుండా ప్రయాణించి..అఫ్ఘానిస్థాన్‌కు చేరుతున్నాయి.
కాగా.. మే 15 నాటికి అఫ్ఘానిస్థాన్‌లో 90 వేల మంది అమెరికన్ సైనికులున్నారు. దళాల ఉపసంహరణ ప్రారంభమయ్యేలోపు పాకిస్థాన్ రహదారులను తమకు అనుమతించని పక్షంలో వివిధ అమెరికన్ సప్లైలను అక్కడే వదిలేయాలని భావిస్తోంది. ప్రస్తుతం అఫ్ఘానిస్తాన్‌లో అమెరికాకు పెద్ద ఇంటి సైజులోని భారీ య్రంతాలున్నాయి. వాటిని విమానాల ద్వారా తరలించడంకన్నా.. అక్కడ వదిలేయడమో లేదా ముక్కలు చేయడమో నమయన్నది పెంటగాన్ భావన.

0 comments:
Post a Comment