Wednesday

ఉమ్మిలో నెత్తురు : కారణాలు


సాధారణంగ ఉమ్మిలో నెత్తురు ముక్కునుంచి రక్తం కారిన కొంతసేపటి తరువాతనైనా కనిపి స్తుంది, లేదా బ్రష్‌తో బలంగా దంతధావనం చేసి నప్పుడు చిగుళ్లకు గాయం కావడం వల్లనైనా కనిపి స్తుంది. లేకపోతే శ్వాస మార్గంలో ఎక్కడైనా ఇన్‌ ఫెక్షన్‌కావటం, ఇరిటేట్‌ కావటం వల్లనైనా ఉమ్మిలో నెత్తురు కనిపించవచ్చు.కళ్లెలో రక్తం పడటానికి మరొక ప్రధాన కారణం ఏమిటంటే గడ్డకట్టిన రక్తం ఊపిరితిత్తులలో ప్రయా ణించటం. ఊపిరితిత్తులకు కేన్సర్‌ సోకటం వలన కూడా కళ్లెలో రక్తం కనిపిస్తుంది. అయితే ఈ రెండు కారణాలూ చాలా అరుదు. మీరు దగ్గిన ప్పుడు లేదా ఉమ్మివేసినప్పుడు ఉమ్మిలో రక్తంలో కనిపిస్తే ఈ కింది కారణాల్లో ఏదో ఒకటి కారణమై ఉండవచ్చునని భావించాలి. కళ్లె ఏ రంగులో ఉంది? ఏ సందర్భంలో రక్తం పడింది అనే విష యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
పొగ తాగడం వలన
మీకు40 సంవత్సరాల వయస్సుపైబడి, దీర్ఘ కాలికంగా మీరు సిగరెట్లు తాగుతూ ఉండి, దాని వలన దగ్గును మాటిమాటికి వెలువరిస్తూ ఉంటే ఒకరోజు మీరుఉమ్మిన కళ్లెలో నెత్తురు కనిపించే అవకాశం ఉంది. ఆ నెత్తురు చారికలాగా కనిపించ వచ్చు. కళ్లెతో కలగలసి కనిపించవచ్చు. ఆ సమ యంలో మీరు దగ్గిన దగ్గు తీవ్రంగా ఉండదు. ఎప్పుడూ దగ్గినట్లే దగ్గుతారు.
సిగరెట్లు తాగే అందరిలాగే మీరూ మొదటి సారిగా కళ్లెలో కనిపించిన నెత్తురును మామూలే అన్నట్లు ఉపేక్షిస్తారు. అయితే తరువాత ఇక దగ్గిన ప్పుడల్లా కళ్లెలో లేదా ఉమ్మిలో నెత్తురు కనిపిం చడం మొదలవుతుంది.తరువాత కొన్నాళ్లకు జ్వరం, ఛాతీలో నొప్పి, కాళ్లలో అసౌకర్యం మొదలవుతాయి. అప్పుడు మీరు గుండెను పరీక్షిం పజేసుకోవాల్సిన అవసరం కలుగుతుంది. లేదా మీ ఊపిరితిత్తులకు కేన్సర్‌ సోకి ఉండవచ్చు.
మీకు 40 సంవత్సరాలు నిండి ఉండటం, ఎప్ప టినుంచో సిగరెట్లు తాగుతున్న చరిత్ర ఉండటం అనేవి చాలా ముఖ్యమైన విషయాలు. జ్వరం లేకుండా ఉండటం, దగ్గీ దగ్గీ ఉమ్మిలో నెత్తురు పడటం - ఇవి ఊపిరితిత్తుల కేన్సర్‌ లక్షణాలు. కేన్సర్‌ తాలూకు గడ్డ ఊపిరితిత్తులనిండా వ్యాపి స్తున్న కొద్దీ మీకు ఊపిరి అందకపోవడం, గాఢంగా శ్వాస తీసుకున్నప్పుడు ఛాతిలో నొప్పి ఉంటాయి.
అయితే ఇది 40యేళ్ల వయస్సు పైబడిన వారి విషయంలో. 40యేళ్లలోపు వయస్సులో ఉండి, మిగతా అన్ని విషయాలలో ఆరోగ్యంగా ఉండి, అంతకు మునుపు ఊపిరితిత్తుల మార్గంలో ప్రమా దకరం కాని పులిపిరులు ఉన్నవాళ్లయితే అది లంగ్‌ కేన్సర్‌ కాకపోయే అవకాశం ఉంది.
ఊపిరితిత్తుల్లో రక్తపు గడ్డ
మీరు స్త్రీలై ఉండి, 25-35 సంవత్సరాల మధ్య వయస్సులో ఉండి, గర్భనిరోధ మాత్రలను వాడుతున్నవారై ఉంటే, గాఢంగా శ్వాస పీల్చుకో బోయేసరికి మీకు అకస్మాత్తుగా ఛాతీ పక్కభాగంలో చురుక్కుమనే పోటు కలుగుతుంది. జ్వరమేమీ ఉండదు. ఒక కాలిపిక్క అప్పుడప్పుడూ నొప్పి చేస్తుంటుంది. ఉమిసినప్పుడు ఉమ్మి లేత ఎరుపు రంగులో ఉంటుంది.
రోజులు గడుస్తున్న కొద్దీ ఉమ్మి ముదురు ఎరుపు రంగులోకి మారుతుంటుంది. అప్పుడప్పుడూ స్వల్పంగా ఊపిరి అందకపోవడం, గుండె దడ ఉంటాయి. ఒక కాలు వాచి, ముట్టుకుంటే నొప్పి పెడుతుంది. ఇవన్నీ మీకు ఊపిరితిత్తుల్లో గడ్డ ఉండటానికి సూచనలు. ఈ గడ్డను పల్మొనరీ ఎంబాలిజమ్‌ అంటారు.
మీరు యవ్వనంలో ఉన్న వారు కాకుండా, యవ్వనం దాటున్న వయస్సులో ఉన్న మహిళ అనుకుందాం. గర్భ నిరోధక మాత్రలను వాడుతూ ఉండరు. కాని, పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తు న్నాయనుకోండి. అప్పుడు ఒకసారి ఈ కింది అంశాలు ఆలోచించండి.
ఈ మధ్య మీకు ఏదైనా ఆపరేషన్‌ అయిందా? సుస్తీ వలన చానాళ్లపాటు పడక మీద ఉన్నారా? ఈ మధ్య చాలా దూరం విమాన ప్రయాణం చేశారా? మీకు వెరికోస్‌ వీన్స్‌ ఉండి, అవి నొప్పి చేస్తున్నాయా? ఇవన్నీ ప్రయాణ సందర్భంలో ఊపిరితిత్తులలో రక్తపు గడ్డను ఏర్పరిచే అంశాలు.
క్షయ కారణంగా
కొద్ది రోజులు, వారాలనుండి విడవకుండా కఫంలో రక్తం చారికలు కనిపిస్తుంటే ఒకప్పుడు దానిని డాక్టర్లు మొట్టమొదట టిబిగా సందేహించే వారు. సమాజంలో ఇప్పుడు టిబి చాలా వరకూ తగ్గిపోయింది. అందువల్ల ఇప్పుడు ఈ లక్షణం కనిపిస్తే క్రానిక్‌ బ్రాంకైటిస్‌ బాగా ముదిరిపోతే వచ్చే బ్రాంకిఎక్టాసిస్‌గా సందేహించడం జరుగుతుంది.
బ్రాంకిఎక్టాసిస్‌లో ఊపిరితిత్తుల తాలూకు శ్వాస గొట్టాలు ఏ భాగంలోనైనా విశాలం కావడమో, బల హీనపడటమో జరుగుతుంది. ఈ రోగులకు సైనస్‌ సమస్య కూడా ఉంటుంది. మనిషికి ఒకసారి బ్రాంకిఎక్టాసిస్‌ వచ్చిందంటే శాశ్వతంగా ఉండిపో తుంది. దీర్ఘకాలం యాంటి బయాటిక్స్‌ వాడటం, ఛాతీకి ఫిజియోథెరపీ అవసరమవుతాయి.
ఈ రోగులు దగ్గినప్పుడు దుర్వాసనతో కూడిన కఫం పడుతుంది. కఫంలో నెత్తురు కూడా ఉండ వచ్చు. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు.. టిబి రోగులు ఉండే నర్సింగ్‌ హోమ్‌లలో పని చేసేవారికి కఫంలతోపాటు క్రమం తప్పకుండా రక్తం పడుతుంటే దానిని టిబిగా సందేహించవచ్చు.
ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌
ఊపిరితిత్తులకు బ్యాక్టీరియా లేదా వైరస్‌ వలన ఏ ఇన్‌ఫెక్షన్‌ సోకినా కఫంలో రక్తం కనిపించవచ్చు. ఉదాహరణకు శ్వాసనాళ వ్యవస్థకు ఇన్‌ఫెక్షన్‌ సోకే క్రానిక్‌ బ్రాంకైటిస్‌. ఈ వ్యాధిలో కఫానికి రక్తం చారికలు కనిపిస్తాయి. లంగ్‌ కేన్సర్‌లో రక్తం కల గలిపి ఉంటుంది.
వృద్ధులకు వచ్చే న్యుమోకోకల్‌ న్యుమోనియాలో కఫంలో ముదురు రంగు రక్తం కలిసి ఉంటుంది. ఎందుకంటే రక్తం ఊపిరితిత్తులలో ఎప్పుడో స్రవించి, అక్కడ నిలువ ఉండి, కొద్ది రోజుల తరువాత మాత్రమే బైటికి వస్తుంది. న్యుమోకోకల్‌ న్యుమోనియాలో జ్వరం, చలి కూడా ఉంటాయి.
గుండె జబ్బుల వలన
సంవత్సరాల తరబడి గుండె జబ్బు ఏదైనా ఉంటే, దాని కారణంగా గుండె బాగా బలహీనపడి, ఊపిరితిత్తులలో రక్తం నిలువ అయ్యే అవకాశం ఉంది. ఈ రోగులు ముఖ్యంగా శ్వాస పీల్చుకోవా లంటే వెనక దిళ్లను పేర్చుకుని కుర్చీలో కూర్చో వాల్సి వస్తుంది. వీరికి దగ్గు సాధారణం. కఫం నురగలాఉండి, రక్తం చిహ్నాలు కనిపిస్తాయి.
ఉమ్మిలో లేదా కఫంలో నెత్తురు కనిపించడానికి పైన పేర్కొన్నవి కొన్ని ముఖ్యమైన కారణాలు

0 comments:

Post a Comment