మహిళలు విమానాలు నడపడంపై సెక్సీ వ్యాఖ్యలు చేసినందుకు విమానంలోంచి ఓ ప్రయాణికుడిని దింపేశారు. తమ మహిళా పైలట్ ఒకరు ఇలా చేసినట్లు బ్రెజిల్‌కు చెందిన ట్రిప్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. విమానాన్ని నడిపేది ఓ మహిళా పైలట్ అని తెలిసిన తర్వాత సదరు ప్రయాణికుడు గట్టిగా వ్యాఖ్యానించడంతో, టేకాఫ్ తీసుకోడానికి ముందే అతగాడిని ఆ పైలట్ విమానం లోంచి దించేశారు. ఈ వివాదంతో విమానం గంట ఆలస్యంగా బయల్దేరింది.
అతగాడిని విమానం వద్దే పోలీసులు పట్టుకుని బెలో హారిజాంట్ విమానాశ్రయం బయటి వరకు తీసుకెళ్లారు. అయితే, అతడిమీద ఏమైనా కేసు పెట్టారా లేదా అన్న విషయం మాత్రం తెలియరాలేదు. తమ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న 1,400 మంది మహిళా సిబ్బందిలో ఏ ఒక్కరి మీద అవమానకర వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని ట్రిప్ ఎయిర్‌లైన్స్ స్పష్టంచేసింది.

0 comments:
Post a Comment