Thursday

ఒబామా ఎన్నికల ఖర్చు 5వేల కోట్లు


ఐదు వేల కోట్ల రూపాయలు.. ఏంటిది అనుకుంటున్నారా? అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇప్పటిదాకా తాను పోటీ చేసిన ఎన్నికల్లో చేసిన ఖర్చు. అక్కడి 'సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్' అనే సంస్థ చేసిన విశ్లేషణలో ఈ విషయం బయటపడింది. ఒబామా 2004లో తొలిసారిగా ఎన్నికల్లో సెనేటర్‌గా పోటీ చేసినప్పటి నుంచి ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల కోసం చేస్తున్న ప్రచారం దాకా చేసిన ఖర్చును ఆ సంస్థ లెక్కించింది. 

అందులో కేవలం ప్రస్తుత ఎన్నికల ప్రచారం కోసమే.. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేశారట. ఇదే ఎన్నికల్లో ఒబామా ప్రత్యర్థిగా బరిలో ఉన్న మిట్ రోమ్నీ మాత్రం అందులో సగమే ఖర్చు పెట్టారట. మొత్తంగా తేలిందేమిటంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ప్రస్తుతం జరుగుతున్నవే అత్యంత వ్యయంతో కూడినవని తేలింది.

0 comments:

Post a Comment