Thursday

2013లో పాక్‌కు అమెరికా రూ.5వేల కోట్ల సాయం


 పాకిస్థాన్ దేశానికి వచ్చే ఏడాదిలో బిలియన్ డాలర్ల( సుమారుగా ఐదువేల కోట్లు) ఆర్థిక సహాయానికి సెనేట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. విదేశీ కార్యకలాపాలకు సంబంధించి52.1బిలియన్ డా లర్ల విదేశాంగ శాఖ బిల్లు 2013ను ఆమోదించినట్లు సెనేట్ అప్రోప్రియేషన్స్ సబ్‌కమిటీ వెల్లడించింది. పాక్‌కు అందించే బిలియన్ డాలర్ల సహాయంతోపాటు 80కోట్ల డాలర్ల విదే శీ సహాయం, అఫ్ఘానిస్థాన్‌కు మూడున్నర బిలియన్ డాలర్ల సహాయం కూడా ఈ బిల్లులో ఉన్నాయి. విదేశీ సహాయానికి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలే వచ్చే సంవత్సరానికీ వర్తిస్తాయని కమిటీ తెలిపింది.

0 comments:

Post a Comment