Saturday

మోకాలి గాయంతో షారుఖ్ పెర్ఫార్మెన్స్


బాలీవుడ్ కి సంబంధించి IIFA అవార్డ్స్ (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడెమీ అవార్డ్స్) కి ఎంతో ప్రత్యేకత వుంది. హిందీ చిత్రరంగానికి చెందిన ప్రముఖులంతా ఈ వేడుకల్లో పాల్గొని అందర్నీ అలరిస్తారు. ఇక ఈ ఏడాది 12 వ ‘ఐఫా’ అవార్డుల వేడుక కెనడాలోని టొరంటో నగరంలో ఈ 23 రాత్రి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మోకాలికి గాయం కావడంతో షారుఖ్ ఖాన్ ఈ వేడుకలకు హాజరవుతాడా, లేదా? అన్నది నిన్నటి దాకా సస్పెన్స్ గా సాగింది. అయితే, తాను హాజరవుతున్నట్టూ, పెర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నట్టూ షారుఖ్ తాజాగా కన్ఫర్మ్ చేశాడు. దాంతో ఈ వేడుకకు మరింత శోభ చేకూరినట్టుగా ఫీలవుతున్నారు.  ప్రియాంకా చోప్రా, దియామీర్జా, మల్లికా షెరావత్, నేహా ధూపియా లతో బాటు పలువురు తారలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.

0 comments:

Post a Comment