Monday

చరణ్ పక్కన కాజల్, హన్సిక


  సరైన అవకాశాలు రాక తెలుగులో కెరీర్ పరంగా ఇబ్బందిపడుతున్న బొద్దుభామ హన్సిక తాజాగా జాక్ పాట్ కొట్టింది. మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ తేజా సరసన నటించే చాన్స్ ఈ భామకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో చరణ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. డి.వి.వి.వి.దానయ్య నిర్మించే ఈ చిత్రంలో హన్సిక సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రధాన కథానాయికగా కాజల్ అగర్వాల్ ఇప్పటికే ఎంపికైంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ చిత్రం షూటింగు జరపడానికి ప్లాన్ జరుగుతోంది. తమన్ సంగీతం సమకూర్చే ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తాడని అంటున్నారు. 

0 comments:

Post a Comment