ఇనుము ఎక్కువగా ఉండి, సులభంగా చవకగా లభించే అన్ని రకాల తాజా ఆకుకూరలను రోజూ తీసుకోవడం ద్వారా రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు. ఇవేకాక యాపిల్, అరటి పండ్లు, ఎండు ఖర్జూరాలు, బాదం, జీడిపప్పు, మాంసం, ముడి ధాన్యాలలో కూడా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
పౌష్టికాహార లోపం కారణంగా ఏర్పడే రక్తహీనత మనిషిని కృంగదీయడమే కాక అనేక శారీరక, మానసిక రుగ్మతలకు దారతీస్తుంది. మనదేశంలో రక్తహీనతతో బాధపడేవారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ప్రధానంగా స్త్రీలు, పిల్లలు ఎక్కువగా రక్తలేమిని ఎదుర్కొంటున్నారు. రక్తహీనత కారణంగా శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్ సరిగ్గా అందక ఇతర అవయవాలపై దీని ప్రభావం పడుతుంది. రక్తహీనతతో బాధపడేవారు ఆహారంలో తగిన మార్పులు చేసుకోవాలి. హోమియో వైద్యంతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని అంటున్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్.
మన శరీరంలో రక్తం ఎర్రగా ఉండడానికి కారణం అందులోని హిమోగ్లోబిన్ అనే పదార్థం. ఎర్రరక్తకణాలలో ఆక్సిజన్‌ను తీసుకుని వెళ్లే కణాలను హిమోగ్లోబిన్ అంటారు. హిమోగ్లోబిన్ తయారవడానికి మాంసకృతులతోపాటు ఇనుము అనే పోషక పదార్థం అవసరం. మన శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం ఒక మోతాదులో ఉంటుంది. ఉదాహరణకు మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, 6 సంవత్సరాల లోపు పిల్లల్లో 11 గ్రాములు, 6-12 మధ్య వయస్కులైన పిల్లల్లో 12 గ్రాములు, గర్భిణి స్త్రీలలో 11 గ్రాములు, బాలింతలలో 12 గ్రాములు ఉండాలి.
హిమోగ్లోబిన్ పరిమాణం దీని కన్నా తక్కువ ఉంటే వారు రక్తహీనతతో బాధపడుతున్నట్లు అర్థం. అనీమియాకు గురైన వ్యక్తి శరీరంలో ఎర్రరక్త కణాలు(ఎరిత్రోసైట్స్) సంఖ్య తగ్గిపోతుంది. రక్తపరీక్షలో ఆర్‌బిసి కౌంట్ ద్వారా రోగి రక్తంలో ఎన్ని ఎర్ర రక్తకణాలున్నాయే విషయాన్ని తెలుసుకోవచ్చు. రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్య 38 శాతం నుంచి 48 శాతం వరకు ఉంటుంది. ఆరోగ్యవంతుల్లో హిమోగ్లోబిన్ ఒక డెసి లీటరుకు 12 గ్రాముల నుంచి 16 గ్రాముల మధ్య ఉంటుంది.
రక్తహీనత నిర్ధారణ
శరీరంలో రక్తం తక్కువగా ఉండడాన్ని అనీమియా లేదా రక్తహీనత అంటారు. ఇది సాధారణంగా వచ్చే వ్యాధే. రక్తహీనతలో చాలా రకాలు ఉన్నాయి. ఎర్రరక్త కణాల పొందిక, వాటి ఆకృతిని బట్టి ఏ రకం రక్తహీనతో నిర్ధారించడం జరుగుతుంది. అనీమియా లక్షణాలు కొందరిలో తక్కువగా మరికొందరిలో ఉధృతంగా ఉంటాయి. చర్మం పాలిపోవడం, గోళ్ల రంగు తెల్లగా మారడం అనీమియాకు సూచనగా గుర్తించవచ్చు. రక్తహీనత తీవ్ర స్థాయిలో ఉన్నపుడు గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. దాని శబ్దంలో తేడాను కూడా గమనించవచ్చు.
ఎందుకొస్తుంది?
రక్తహీనత ముఖ్యంగా స్త్రీలు, పిల్లల్లో ఎక్కువగా కనపడుతుంది. దీనికి ముఖ్యమైన కారణాలుగా వీటిని చెప్పవచ్చు. పౌష్ఠికాహార లోపం: ఐరన్(ఇనుము ధాతువు) అధికంగా ఉండే తోటకూర, గోంగూర వంటి ఆకుకూరలు, బెల్లం, మాంసాహారాలను సమతుల్యంలో తీసుకోకపోవడం.
అధిక రక్తస్రావం: ఆడవారు ఋతుస్రావం ద్వారా, పిల్లలు కడుపులో పొట్ట పురుగులు ద్వారా క్రమేపి రక్తాన్ని కోల్పోయి రక్తహీనతకి గురవుతారు.
రక్తం తయారీలో అవరోధం: మలేరియా వంటి వ్యాధుల వల్ల ఎర్ర రక్తకణాలు ధ్వంసమై మళ్లీ పెరగవు. దీంతో రక్తం తయారు కాక రక్తహీనత ఏర్పడుతుంది.
ఇవీ లక్షణాలు
శరీరం బలహీనంగా ఉండడం, ఏ పనులపై ఆసక్తి ఉండకపోవడం, చిన్న చిన్న బరువులు ఎత్తితేనే ఆయాసం రావడం, నాలుక, కనురెప్పల లోపలి భాగాలు పాలిపోవడం, ఆకలి లేకపోవడం, అలసట, చికాకు, అరచేతుల్లో చెమట, చేతుల గోళ్లు వంగిపోవడం, చిన్న పిల్లల్లో చదువులో అశ్రద్ధ, ఆటలపై అనాసక్తి, నీరసం వంటివి అనీమియా లక్షణాలు. రక్తహీనత కారణంగా నీరసపడడం, గర్భస్రావం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, పుట్టిన బిడ్డ లేదా తల్లి చనిపోవడం, చదువులో వెనుకంజ, ఎక్కువసేపు పనిచేయలేకపోవడం, ఆటలు ఆడలేకపోవడం వంటివి ఏర్పడతాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు
చిన్న పిల్లలకు పొట్ట పురుగుల మందు ఇవ్వాలి. మల విసర్జన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకునే అలవాటు చేయించాలి. శరీరానికి ఇనుము ఎక్కువగా లభించే ఆకుకూరలు, పొట్టు ధాన్యాలు, మాంసాహారం వంటివి ఇవ్వాలి. యుక్త వయసు నుంచి సంతానం పొందడానికి అర్హమైన వయసు మధ్య ఉన్న స్త్రీలకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి. ఇనుము ఎక్కువగా ఉండి, సులభంగా చవకగా లభించే అన్ని రకాల తాజా ఆకుకూరలను రోజూ తీసుకోవడం ద్వారా రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు. ఇవేకాక యాపిల్, అరటి పండ్లు, ఎండు ఖర్జూరాలు, బాదం, జీడిపప్పు, మాంసం, ముడి ధాన్యాలలో కూడా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. సి విటమిన్ ఇనుమును ఎక్కువగా గ్రహించుకునేలా చేస్తుంది. అందువల్ల బత్తాయి, నిమ్మ, ఉసిరి వంటి సి విటమిన్ గల పదార్థాలు అధికంగా తీసుకోవాలి. భోజనం చేసిన వెంటనే కాఫీ, టీలు తాగడం మానెయ్యాలి.
హోమియో చికిత్స
హోమియో వైద్య విధానంలో సప్లిమెంటేషన్ విధానం కాకుండా ఎందుకు రోగి రక్తహీనతతో బాధపడుతున్నాడు, అతని జీర్ణవ్యవస్థలో లోపాలు, దీర్ఘకాలిక వ్యాధులేమైనా ఉన్నాయా వంటి విషయాలను తెలుసుకుని అందుకు అనువుగా మందులు ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోలో కాల్కేరియా గ్రూపు, ఫెర్రమ్, గ్రే నాట్రమ్ గ్రూప్ మందులతోపాటు ఆర్షనిక్ ఆల్బ్, చైనా, సైక్లమిన్, కాంస్రమ్ మందులు రక్తహీనత పోగొట్టడానికి పనిచేస్తాయి.

1 comments:
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు
Post a Comment