అమెరికాను ధిక్కరించి అణుపాటవాన్ని ప్రదర్శిస్తున్న ఇరాన్‌కు పాకిస్థాన్ మద్దతు ప్రకటించింది. ఇరాన్‌పై దాడి చేయాలని భావిస్తే వారికి తమ సహకారం లభించదని స్పష్టం చేసింది. ఇరాన్‌పై దాడికి పాక్ వైమానిక స్థావరాలను ఇవ్వబోదని పాక్ అధ్యక్షుడు జర్దారీ చెప్పారు. అఫ్ఘాన్, ఇరాన్ అధ్యక్షులు కర్జాయ్, అహ్మది నెజాద్‌తో జరిపిన చర్చల సందర్భంగా ఈమేరకు హామీ ఇచ్చారని వార్తలు వచ్చాయి.
పాక్ ఎవరితో వ్యాపారం చెయ్యకూడదో అమెరికా చెప్పవలసిన అవసరం లేదన్నారు. అయితే జర్దారీ వ్యాఖ్యలపై అధికారికంగా ఏ ప్రకటనా వెలువడలేదు. సమావేశం తర్వాత ముగ్గురు అధ్యక్షులు..తమ అంతర్గత వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.

0 comments:
Post a Comment