Saturday

పేదరికం తగ్గింది.. ఆకలి పెరిగింది! ఆసియా-పసిఫిక్ అభివృద్ధిపై ఐరాస


ఆసియా-పసిఫిక్ దేశాల్లో పేదరికం తగ్గిందని, అయితే ఇప్పటికీ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. శిశు, బాలింతల మరణాలు కూడా ఎక్కువ సంఖ్యలో సంభవిస్తున్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఈ దేశాలు 2015లోగా సాధించాల్సిన మిలీనియం అభివృద్ధి లక్ష్యాల్లో కొన్నింటిని మూడేళ్ల మునుపే సాధించాయి. రోజుకు 1.25 డాలర్లతో బతుకునీడ్చే వారి శాతాన్ని 50 నుంచి 25 శాతానిక తగ్గించాలన్న లక్ష్యానికి మించి 1990-2009 మధ్య 22 శాతానికి తగ్గించాయి.

ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక ఆసియా-పసిఫిక్ విభాగం(ఈఎస్‌సీఏపీ), ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఐరాస అభివృద్ధి కార్యక్రమం సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ఈ నివేదికను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేష్ శుక్రవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతం మిలీనియం అభివృద్ది లక్ష్యాలు సాధించడంలో ప్రగతిని కనబరిచిందని నివేదిక తెలిపింది.

0 comments:

Post a Comment