Tuesday

యోగా పద్మాసనం

అర్ధ పద్మాసనం 


పద్మాసనం వేయడం కొంతమందికి కష్టంగా ఉంటుంది. అప్పుడు మొదట అర్థ పద్మాసనం ప్రయత్నించాలి. ముందుగా ఒక్క కాలిని మాత్రం మోకాలి వద్ద మడిచి కుడిపాదాన్ని ఎడమ కాలిమీద పెట్టి మోకాలి మీద చేయి పెట్టి పైకి, కిందకు 15 సార్లు కదల్చాలి. ఇలా రెండుకాళ్లతో ప్రయత్నించాలి. దీంతో నెమ్మదిగా పూర్ణ పద్మాసనం చేయగలుగుతారు.

పూర్ణ పద్మాసనం 
నేల మీద రెండు కాళ్లు ముందుకు చాపి కూర్చోవాలి. కుడికాలును మోకాలి వద్ద మడిచి కుడిపాదాన్ని ఎడమకాలి తొడదగ్గర ఉంచాలి. ఎడమకాలిని మోకాలి వద్ద మడిచి ఎడమ పాదాన్ని కుడికాలి తొడ దగ్గర ఉంచాలి. రెండు పాదాల మడమలు పొట్టదగ్గర ఆనేటట్లు ఉంచాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. ఈ స్థితిలో ఓంకారాన్ని మూడుసార్లు స్మరించాలి. రెండు చేతులనూ ధ్యానమువూదలో ఉంచాలి.

పద్మాసనం యథావిధిగా వేసిన తరువాత రెండు చేతులతో బ్యాలెన్స్ చేస్తూ శరీరాన్ని పూర్తిగా పైకి లేపాలి. శరీర బరువు అంతా చేతుల మీదనే ఉండాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉండి, తిరిగి యథాస్థితికి రావాలి.

ఉపయోగాలు :
వెన్నెముకను నిటారుగా ఉంచుతుంది. మనసు ప్రశాంతం చేస్తుంది. మెడి ప్రాణాయామాలకు మంచి ఆసనం.
జాగ్రత్తలు :
సయాటికా ఉన్నవారు, మోకాలి నొప్పులు ఎక్కువగా ఉన్నవారు చేయకూడదు.

0 comments:

Post a Comment