Monday

ఒత్తిళ్ల నుంచి విముక్తి


సూర్యభేదన ప్రాణాయామం 
ముందుగా సుఖాసనంలో కానీ, వజ్రాసనంలోకానీ కూర్చోవాలి. ఎడమ నాసికా రంధ్రం మూసివేసి, కుడి నాసికా రంధ్రం ద్వారా గాలి పీల్చుకుని, ఎడమ నాసికా రంధ్రం ద్వారా వదిలివేయాలి. ఇలా ఒకటి నుంచి 3 నిమిషాల వరకు చేయాలి.


చంద్రభేదన ప్రాణాయామం
సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ కూర్చోవాలి. కుడి నాసికా రంధ్రం మూసివేసి, ఎడమ నాసికా రంధ్రం ద్వారా గాలిని పీల్చుకుని కుడి నాసికా రంధ్రం ద్వారా గాలిని వదిలివేయాలి. ఇలా ఒకటి నుంచి మూడు నిమిషాల వరకు చేయాలి.

మత్స్యాసనం
పద్మాసనంలో కూర్చున్న తరువాత రెండు చేతులను ఒకదాని తర్వాత ఒకటి వెనకగా పెట్టి తలను నెమ్మదిగా మాడు భాగం భూమి మీద ఉండేటట్లు ఆన్చాలి. నెమ్మదిగా చేతులు తీసివేసి, రెండు చేతులతో రెండు కాళ్ల బొటనవేళ్లను పట్టుకోవాలి. కళ్లు మూసుకుని పొట్ట భాగం మీద దృష్టి సారించాలి. శ్వాస మామూలుగా ఉండాలి. ఇలా కొద్దిసేపు ఉన్న తరువాత నెమ్మదిగా యథాస్థితికి రావాలి.
ఉపయోగాలు:
- ఆస్తమా ఉన్నవారికి మంచిది.
- థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది.
- పైల్స్, మలబద్ధకం ఉన్నవారికి మంచిది.
- మెదడుకు, ఊపిరితిత్తులకు రక్తవూపసారం ఎక్కువ చేస్తుంది.
జాగ్రత్తలు :
- అల్సర్, హృదయ సంబంధిత జబ్బులు, హెర్నియా ఉన్నవాళ్లు చేయకూడదు.

పద్మభుజంగాసనం
ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులు భూమి మీద ఆన్చి రెండు చేతుల సపోర్ట్‌తో బోర్లా పడుకోవాలి. ఇప్పుడు చేతులు వెనక్కి తీసుకెళ్లి నమస్కార ముద్రలో ఉంచాలి. నెమ్మదిగా గాలిపీలుస్తూ తల పైకెత్తి కొన్ని సెకండ్లు ఆపాలి. ఉండగలిగినంత సమయం ఉండి నెమ్మదిగా గాలి వదులుతూ యథాస్థితికి రావాలి. ఈ విధంగా మూడుసార్లు చేయాలి.
ఉపయోగాలు :-వెన్నెముకను శక్తివంతం చేస్తుంది.

0 comments:

Post a Comment