Tuesday

భారత రాయబారిపై 'చైనా'లో దాడి


చైనాలో భారత రాయబారిపై కోర్టు హాలులో దాడి జరిగింది. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. సంఘటన పట్ల భారత్‌లోని చైనా రాయబార వర్గాలకు, చైనాలోని విదేశాంగ అధికారులకు తన నిరసనను తెలిపింది. షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న రాయబారి ఎస్.బాలచంద్రన్ (46) శనివారం ఒక కేసు విషయమై స్థానిక కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలోనే స్థానిక వ్యాపారుల్లో ఒకరు అతడిపై దాడి చేశారు.

అదే సమయంలో మధుమేహ వ్యాధిగ్రస్తుడైన బాలచంద్రన్‌ను విచారణ పూర్త య్యే వరకూ కనీసం మంచినీళ్లు తాగేందుకు కూడా అక్కడి అధికారులు అంగీకరించలేదు. ఫలితంగా కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అధికారులు బాలచంద్రన్‌ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందజేయడంతో ఆయన కోలుకున్నా రు.

రాయబారి స్థాయి వ్యక్తిని కోర్టు బయటకు రానీయకుండా అడ్డుకున్న వైనా న్ని తీవ్రంగా పరిగణించిన భారత విదేశాంగ శాఖ ఢిల్లీలోని చైనా దౌత్య కార్యాలయ డిప్యూటీ చీఫ్ జాంగ్ యూని పిలిపించి తన నిరసనను వ్యక్తం చేసింది. కా గా, ఈ సంఘటన జరిగిన వెంటనే షాంఘైలోని భా రత కాన్సుల్ జనరల్ రివ గంగూలీ దాస్ స్పందిస్తూ బాలచంద్రన్‌పై భౌతిక దాడి జరిగిందని దీంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారని మీడియాకు వెల్లడించారు.

వాస్తవానికి ఇద్దరు భారతీయ వ్యాపారులైన రహేజా, శ్యాంసుందర్‌లు స్థానిక వ్యాపారుల వద్ద చేసిన అప్పు లు చెల్లించకపోవడంతో వీరిద్దరిని నిర్బంధించారు. దీం తో రంగంలోకి దిగిన బాలచంద్రన్ వారి విడుదలకు చర్చలు జరిపేందుకు న్యాయస్థానానికి వచ్చారు. ఆ సమయంలోనే దాడి ఘటన చోటుచేసుకుంది.

0 comments:

Post a Comment