Tuesday

కృష్ణా నదిపై కర్ణాటక కొత్త ప్రాజెక్టు


ఐదు జిల్లాల్లోని 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే భారీ ప్రాజెక్టు నిర్మాణానికి కర్ణాటక కేబినెట్ పాలనాపరమైన అనుమతిని ఇచ్చింది. రూ. 17,207 కోట్ల వ్యయమయ్యే ఈ ఎగువ కృష్ణా మూడోదశ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాజెక్టు ద్వారా బీజాపూర్, కొప్పళ, బాగల్‌కోట, రాయచూరు, గుల్బర్గా జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది. అయితే, దీనివల్ల 20 గ్రామాల్లోని 76వేల ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని కర్ణాటక నీటివనరుల మంత్రి బసవరాజ బొమ్మై తెలిపారు.

ఈ ప్రాజెక్టులో 130.5 టీఎంసీల నీటిని నిల్వచేస్తారు, అదే సమయంలో ఆల్మట్టి డ్యాం ఎత్తును ప్రస్తుతమున్న 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచుతారు. సహాయ పునరావాస కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి రుణాల కోసం హడ్కో, నాబార్డ్‌లతో తొలిదశ చర్చలు నిర్వహించినట్లు బొమ్మై చెప్పారు. అయితే, ఈ ప్రాజెక్టుకు ఇంకా కేంద్ర జలసంఘం, పర్యావరణ మంత్రిత్వశాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉందన్నారు. లక్ష హెక్టార్లకు పైగా భూమికి సాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు జాతీయహోదా కావాలని కర్ణాటక సర్కారు కోరనుంది.

0 comments:

Post a Comment