Tuesday

ఇవి తింటే మీ గుండె సేఫ్...


డయాబెటిస్ ఉన్న వారిలో రక్తనాళాలకు జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. దీనిమూలంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. అయితే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొక్కోలి వంటి కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు వైద్యులు. ఈ కూరగాయల్లో ఉండే సల్ఫోరపేన్ అనే పదార్థం మాలిక్యూల్స్‌ను తగ్గించడంలో సహాయపడే ఎంజైమ్స్ ఉత్పత్తి కావడాన్ని ప్రేరేపిస్తుంది. ఈ మాలిక్యూల్స్‌ను ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అని కూడా పిలుస్తారు.

వీటి లెవెల్స్ పెరిగినపుడు రక్తంలో షుగర్ శాతం పెరిగిపోతుంది. తద్వారా గుండెకు రక్తాన్ని సర ఫరా చేసే రక్తనాళాలు దెబ్బతింటాయి. గుండె పోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఈ పరిస్థితిని నిరోధించడంలో బ్రొక్కోలి, క్యాలీఫ్లవర్ చక్కగా ఉపకరిస్తాయి. వీటిలో సి-విటమిన్, కాల్షియం, ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఇందులో యాంటీ అక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ కూరగాయల్లో రోగ నిరోధకశక్తిని పెంపొందించే గుణం ఉందని, పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడకుండా ఇవి కాపాడతాయని గతంలో జరిపిన పరిశోధనల్లో తేలింది. ఇంకేం.. వారంలో ఒకరోజైనా ఈ కూరగాయలను మీ మెనూలో ఉండేలా చూసుకుని ఆరోగ్యంగా ఉండండి.

0 comments:

Post a Comment