Monday

అణు కేంద్రాల జాబితాలు మార్చుకున్న భారత్, పాక్


భారత్, పాకిస్థాన్ దేశాలు పరస్పరం అణు కేంద్రాల జాబితాలు మా ర్చుకున్నాయి. తమ దేశంలోని అణు కేంద్రాలు, సౌకర్యాలకు సంబంధించిన జాబితాను ఆదివారం ఉదయం 11. 30 గంటలకు ఇక్కడి విదేశాంగశాఖ కార్యాలయంలో భారత హై కమిషన్ ఉన్నతాధికారులకు పాకిస్థాన్ అందించింది. అలాగే భారత్ కూడా మధ్నాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయంలో పాక్ హై కమిషన్ అధికారులకు అణు కేంద్రాల జాబితాను సమర్పించింది. అణు కేంద్రాలు, సౌకర్యాలపై దాడులను నిషేధిస్తూ ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన అణు కేంద్రాలకు సంబంధించిన జాబితాలను మార్చుకోవాలని రెండు దేశాలు 1988 డిసెంబర్‌లో ఒప్పందం చేసుకున్నాయి.

అయితే 2008లో పాకిస్థాన్ అడ్డాగా లష్కరే తాయిబా ఉగ్రవాదులు ముంబై ఘాతుకానికి పాల్పడడంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఆటంకం కలిగింది. అయినా ఈ ప్రక్రియ కొనసాగడం విశేషం. ఆ తర్వాత భారత్‌లోని పాక్, పాక్‌లోని భారత్ ఖైదీల జాబితాను కూడా సంవత్సరానికి రెండుసార్లు అందించుకోవాలని 2008 మేలో మరో ఒప్పందం జరిగింది. దాయాది దేశాల మధ్య రెండేళ్ళుగా ఆగిన శాంతి చర్చల ప్రక్రియ మళ్లీ గతేడాది నుంచి ప్రారంభమైంది.

0 comments:

Post a Comment