Tuesday

రోగ నిరోధక కణాలను మోసపుచ్చే హెచ్ఐవీ...!


ఎయిడ్స్ వ్యాప్తిని నియంత్రించేందుకు వీలుగా శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయం కనుగొన్నారు. ఈ వ్యాధికి మూలమైన హెచ్ఐవీ వైరస్ వన శరీరంలోని రక్షణ వ్యవస్థను మోస పుచ్చి ఎలా వ్యాపిస్తుందో అమెరికన్ పరిశోధకులు తెలుసుకోగలిగారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణుల బృందం దీనిపై అధ్యయనం చేసింది.

'హెచ్ఐవీ వైరస్ విజయానికి కారణం అది వేగంగా తన దాడుల వ్యూహాన్ని మార్చుకోవడమే. మనకు రక్షణగా ఉండే ప్రొటీన్లనే మనపై దాడికి ఉపయోగించుకుంటాయి. వాటిని లోబరచుకొని వైరస్‌ను విస్తరిస్తుంది' అని శాస్త్రవేత్తలు వివరించారు. వీరు ముందు గా శరీరం తయారు చేసుకునే ప్రొటీన్లు, హెచ్ఐవీ బారిన పడిన ప్రొటీన్లను పరిశీలించారు.

వాటి మధ్య పరస్పరం జరుగుతున్న చర్యలను అధ్యయనం చేశారు. సహజసిద్ధ ప్రొటీన్లతో కలిసిపోయిన హెచ్ఐవీ ప్రొటీన్లు మనిషిలోని రోగ నిరోధక శక్తిని తట్టుకుంటాయని, దీంతో తెల్లరక్తకణాలకు వైరస్ సోకుతోందని గుర్తించారు.

0 comments:

Post a Comment