Tuesday

జూదమాడటంలో కోతులు మనిషికి తీసిపోవు...!


కోతుల తెలివిని మనం తక్కువగా అంచనా వేస్తున్నామా? అవునంటున్నారు శాస్త్రవేత్తలు. మనకు ధీటుగా అవి చాలా పనులు చేస్తాయని ఇప్పటికే గుర్తించినప్పటికీ ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. కోతులు కూడా మనలాగే జూదమాడగలుగుతాయని జర్మనీకి చెందిన మాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్ ఫర్ సైకోలింగ్విస్టిక్స్ సంస్థకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది.

వ్యత్యాసాలను గుర్తించి దానికనుగుణంగా కోతులు నిర్ణయం తీసుకుంటాయని వెల్లడించారు. ఇందుకోసం కొన్ని బోర్లించిన కప్పుల కింద చిన్న,పెద్ద పరిమాణాల్లో అరటి పండు ముక్కలను ఉంచి కోతుల ముందు పెట్టారు. తర్వాత ఆ కప్పులను అటూ ఇటు మార్చారు.

వాటిని ఎంపిక చేసుకోవడంలో కోతులు ఆచితూచి వ్యవహరించాయని, కప్పుల సంఖ్య పెంచినా కొద్దీ కోతులు మరింత జాగ్రత్తగా పెద్దముక్కలున్న కప్పులను ఎంపిక చేశాయని శాస్త్రవేత్తలు వివరించారు. కోతి జాతికి చెందిన అన్ని జంతువుల్లోనూ ఈ తెలివి ఉన్నట్లు తెలిపారు.

0 comments:

Post a Comment