Tuesday

బ్లాక్‌బెర్రీ రికార్డులివ్వండి పాక్ జ్యుడీషియల్ కమిషన్


పాకిస్థాన్‌లో రాజకీయ అలజడి రేపిన మెమోగేట్ వివాదానికి సంబంధించి, బ్లాక్‌బెర్రీ సమాచార రికార్డులను సేకరించాల్సిందిగా ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్న న్యాయ కమిషన్, పాక్ అధికారులను ఆదేశించింది. వివాదానికి మూలకారకుడిగా భావిస్తున్న మాజీ రాయబారి హుసేన్ హక్కానీ, ఈ విషయాన్ని రచ్చ చేసిన అమెరికాలోని పాక్ వాణిజ్య ప్రముఖుడు మన్సూర్ ఇజాజ్‌ల మధ్య బ్లాక్‌బెర్రీ సెల్‌ఫోన్ నెట్‌వర్క్ ద్వారా జరిగాయంటున్న సంభాషణల వివరాలను సేకరించి సమర్పించాల్సిందిగా సుప్రీం కోర్టు నియమించిన ఈ కమిషన్, సోమవారం తొలిదఫాగా జరిపిన సమావేశంలో పాక్ అధికారులను ఆదేశించింది. ఇందుకోసం కెనడాలోని రీసెర్చి ఇన్ మోషన్ కంపెనీ నుంచి, పాక్‌లోని బ్లాక్‌బెర్రీ ప్రతినిధుల నుంచి ఈ సంభాషణల రికార్డులను సేకరించాల్సిందిగా కోరింది.

0 comments:

Post a Comment