క్రమంగా విస్తరిస్తూ వివిధ రకాల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో వైద్య, ఆరోగ్య రంగం ఎంతో ముఖ్యమైనది. ఈ రంగంలో ప్రవేశించిన వారికి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. నూతన ఆవిష్కరణలు, నిరంతర పరిశోధనలు, అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఇక్కడ సవాలుగా మారుతున్నాయి. వాటికి తగిన పరిష్కారం కనుగొనాలంటే మెరికల్లాంటి ఉద్యోగుల అసరంతోపాటు ఉన్న ఉద్యోగులు మరింత నైపుణ్యం అలవర్చుకోవలసిన అవసరం వుంటోంది. ఫ్యాకల్టీలు, టీచర్లు, జర్నలిస్టులు, పరిశోధకులు, అడ్మినిస్ట్రేటర్లు, ఎన్విరాన్‌మెంటలిస్టులు, డెమోగ్రాఫర్లు, లేబొరేటర్లు, సోషల్ వర్కర్లు వంటి స్పెషలైజ్డ్ వృత్తులేగాక ఇంకా అనేక రకాల ఉద్యోగులు వైద్య ఆరోగ్య రంగంలో ఉంటారు. ప్రభుత్వ, ప్రయివేటు వైద్య రంగాల్లో వీరి అవసరం పెరుగుతోంది కాబట్టి ఉద్యోగార్థులకు, ఉద్యోగులకు కూడా ఇదొక ఆసక్తికరమైన, అవసరమైన రంగంగా విస్తరిస్తోంది.
వైద్య, ఆరోగ్యరంగం ఒక నిరంతర పరిశోధనల నిలయం. సమస్యలు తలెత్తినప్పుడు వాటికి పరిష్కారం కనుగొనాలంటే సాధన, శోధన తప్పనిసరి. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఆయా స్పెషలైజ్డ్ వృత్తుల్లో నైపుణ్యం సంపాదించాలి. అయితే అంతకంటే ముందు అర్హతలు సంపాదించాలి. మెడికల్ అండ్ హెల్త్ ప్రొఫెషనల్స్‌కు నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికెళ్లినా ఉద్యోగ అవకాశాలు లేవనే సమస్యే లేదు. ముఖ్యంగా ఎన్వివరాల్‌మెంట్ హెల్త్, బయోస్టాటిక్స్, బిహేవియరల్ సన్స్/హెల్త్ ఎడ్యుకేషన్, ఎపిడెమోలజీ, హెల్త్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్/మేనేజ్‌మెంట్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, న్యూట్రిషన్, ఇంటర్నేషనల్ గ్లోబల్‌హెల్త్, పబ్లిక్‌హెల్త్ లేబొరేటరీ ప్రాక్టీస్, పబ్లిక్‌హెల్త్‌పాలసీ, హెల్త్ ఎకానమిక్ అండ్ ఫైనాన్సింగ్. లాంటి స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్‌కు వైద్య ఆరోగ్య రంగంలో అవకాశాల ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
వైద్య, ఆరోగ్య రంగంలో అవకాశాలు రాబట్టుకోవడం అంత సులువు కాదు. సేవా దృక్పథంతోపాటు తగిన అర్హతలు ఉన్నప్పుడే ఇందులోకి ప్రవేశించాలి. ఇందులోనూ అనేక విభాగాలు... సేవలూ ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో విధమైన ప్రాధాన్యత, పనివిధానం ఉంటుంది. ఏ విభాగంలోని ఉద్యోగులు ఆ విభాగానికి సబంధించిన విషయాలపట్ల సంపూర్ణ అవగాహన ఏర్పర్చుకోవాలి. అప్పుడే వారు నైపుణ్యంగల ఉద్యోగులుగా గుర్తింపు పొందుతారు. ప్రమోషన్లు, పదోన్నతులు లభిస్తాయి. వైద్య, ఆరోగ్య సేవలు విస్తరించేందుకు ప్రభుత్వరంగంలోనూ కొత్తకొత్త పథకాలు, ప్రాజెక్టులు, నూతన ప్రణాళికలు రూపొందుతుంటాయి. కాబట్టి అక్కడా అవకాశాలుంటాయి.
ఈ రంగంలో పబ్లిక్‌హెల్త్ వ్యవస్థ, క్లినికల్ హెల్త్ వ్యవస్థ అత్యంత ప్రధానమైంది. పబ్లిహెల్త్ వ్యవస్థ సమస్త ప్రజానికానికి సంబంధించింది. క్లినికల్‌హెల్త్ వ్యవస్థ మెడికల్ రంగంలోని ప్రాథమిక క్లినికల్ ప్రొఫెషనల్స్‌కు సంబంధించింది. వీటిలో కూడా అనేక చిన్న చిన్న విభాగాలు ఉంటాయి. ఈ రంగంపట్ల అవగాహన పెంచుకుంటే ఎందులో ప్రవేశిస్తే ఎలాంటి సేవలు అందించవచ్చో తెలుసుకోవచ్చు. ఇదొక నిరంతర అధ్యయనవ్యవస్థ కూడా. అనేక రకాల ఆరోగ్య సమస్యలు, కొత్తకొత్త వ్యాధులు, ఈ రంగానికి సవాలుగా మారుతుంటాయి. వాటన్నింటికీ పరిష్కారం కనుక్కోవాలంటే నిరంతర అధ్యయనం తప్పనిసరి. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలోనూ వైద్య, ఆరోగ్య రంగంలో బహుళ అవకాశాలు ఉంటాయి. ప్రజలతో సత్సంబంధాలుగల వృత్తి నైపుణ్యం అలవడుతుంది. పురోగతికి అది దోహద పడుతుంది. ఆరోగ్య రంగమంటే కేవలం అనారోగ్యాల బారినుంచి కాపాడడం కోసమే కాదు... మెరుగైన ఆరోగ్యవ్యవస్థకు అవసరమైన కొత్తకొత్త విషయాలు పరిశీలించడం, పరిశోధించడం కూడా ఇక్కడ చాలా ముఖ్యం. అందుకోసం పబ్లిక్‌హెల్త్ విభాగంలో రీసెర్చ్ బృందాలు ఉంటాయి. వృత్తి నైపుణ్యం గల వారికి ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో అనేక రకాల ఉద్యోగాలు లభిస్తాయి. పబ్లిక్‌హెల్త్‌లో గ్రాడ్యుయేట్లకు విదేశాల్లోనూ ఉద్యోగవకాశాలు ఉంటాయి.మన దేశంలోనూ లోకల్, స్టేట్, సెంట్రల్ హెల్త్ డిపార్టుమెంట్లల్లో వీరికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇవేగాక ఫుడ్‌సేఫ్టీ ఇన్‌స్పెక్టర్స్, హెల్త్ ఎడ్యుకేటర్స్, పాలసీ ఎనాలిస్ట్స్, ఎపిడెమియాలజిస్ట్స్ లాంటి ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. యూనివర్సిటీల్లోని పరిశోధక విభాగాల్లో ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రభుత్వ ఆరోగ్యరంగ సంస్థల్లో, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో, నేషనల్ హెల్త్ రీసెర్చ్ సెంటర్లల్లో, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ లాంటి వాటిలో అనేక అవకాశాలు ఉంటాయి. ఏ కెరీర్లోకి ప్రవేశించాలనుకున్నా అందుకు తగిన అర్హత సాధించి ఉద్యోగం సంపాదించగానే సరిపోదు. ఆ తర్వాత అందులో పురోగతి సాధించడం ఎంతో ముఖ్యం. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటూ ఎదుగుదలకు కావలసిన విషయాలను అధ్యయనం చేయాలి. అప్పుడే వైద్య ఆరోగ్య రంగంలో ప్రవేశించిన వారికి పురోగతి సాధ్యమవుతుంది.
0 comments:
Post a Comment