ఇది 2008కన్నా ప్రమాదం
ప్రపంచ దేశాలు తప్పించుకోలేవు
ముక్కలు కానున్న యూరోపియన్ యూనియన్
యూరో మూలాల్లోనే లోపాలు
సోరోస్ ఫండ్ చీఫ్ జార్జ్ సోరోస్ జోస్యం
హైదరాబాద్, జనవరి 5 : యూరో పతనం యూరప్ దేశాలకు మాత్రమే కాదు గ్లోబల్ ఎకానమికే ఉపద్రవంగా మారుతోంది. ఇది సృష్టించే ప్రళయం నుంచి ఈసారి ప్రపంచ దేశాలు తప్పించుకోవడం కష్టమేనని సోరోస్ ఫండ్ చైర్మన్ జార్జ్ సోరోస్ హెచ్చరిస్తున్నారు. ఒక దేశంతో మరో దేశానికి విడదీయరాని సంబంధాలుండటమే ఇందుకు కారణమని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యూరో సంక్షో భం తీరుతెన్నులు, యూరోపియన్ యూనియన్ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.2008 ఆర్థిక సంక్షోభానికి యూరో జోన్ ప్రత్యక్ష కారణమనేది సోరోస్ అభిప్రాయం. మరో ఆర్థిక ప్రళయానికి కూడా ఈ దేశాలే కారణం కావచ్చని, ఇందుకు యూరో పతనం నాంది పలుకుతుందని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ముక్కలు చెక్కలైనా ఆశ్చర్యపోనవసరంలేదని ఆయన జోస్యం చెప్పారు. లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా నిధులను నిర్వహించే సోరోస్ ఫండ్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల్లో కలకలం రేపాయి.
డేంజర్.. యమ డేంజర్.. యూరో అనేది కొన్ని దేశాలకు సంబంధించిన కరెన్సీ. దీని విలువ పతనమైతే ఏం జరుగుతుంది? ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా ఉంటుంది? ఈ ప్రభావాన్ని అంచనా వేయలేక స్టాక్ మార్కెట్లు రోజుకో రకంగా స్పందిస్తున్నాయి. అత్యంత సంక్లిష్టమైన ఈ సమస్యలకు సోరోస్ సులభంగా జవాబులు చెప్పారు. యూరో పతనానంతర పరిస్థితులు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు వివరించారు. 'యూరో పతనమైతే యూరోపియన్ యూనియన్ ముక్కలైపోతుంది. చూడటానికి ఇది రాజకీయ సమస్యలా కనపడుతుంది. కానీ.. ఇది మరింత ప్రమాదకరమైనదనేది నా అభిప్రాయం. 2008 ఆర్థిక మాంద్యానికి మించిన విపత్తును సృష్టించే శక్తి దీనికి ఉంది' అని సోరోస్ తెలిపారు. నిజానికి యూరో కరెన్సీ రూపకల్పనలోనే లోపాలున్నాయి. ఇవి యూరోజోన్ సంక్షోభానికి కార ణమై ప్రపంచంపైనే ప్రభావం చూపుతున్నాయి.
యూరో సృష్టికర్తలు ఈ లోపాలకు ప్రాధాన్యమివ్వలేదు. ఇ ప్పటికీ ఈ లోపాలను పూర్తిగా గుర్తించలేదు లేదా కొన్నింటిని ఉపేక్షించారు. ప్రస్తుతం ఇవే మరో సంక్షోభానికి నాంది పలుకుతున్నాయని ఆయన వివరించారు. ఆర్థిక మార్కెట్లు ఎలా పనిచేస్తాయనే అంశంపై తప్పుడు భావనలు ప్రచారంలో ఉన్నాయి. అసమతుల్యతలు నెలకొన్నప్పుడు అవి ప్రభుత్వ రంగంపైనే ప్రభావం చూపుతాయనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక మార్కెట్లపైనా వీటి ప్రభావం ఉంటుందనే విషయాన్ని అందరూ విస్మరిస్తున్నారని సోరోస్ వ్యాఖ్యానించారు.
ఇది బాండ్ల సంక్షోభం.. యూరో సంక్షోభాన్ని విశ్లేషించిన సోరోస్ యూరోపియన్ యూనియన్ మూలాల్లోకి వెళ్లారు. ఈ సందర్భంగా యూరో పుట్టు పూర్వోత్తరాలు, తదనంతర పరిణామాలను వివరించారు. మొదట యూరో కరెన్సీని ప్రవేశపెట్టినప్పుడు యూరోపియన్ కేంద్ర బ్యాంకు తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. యూరో మార్కెట్ ప్రవేశం తర్వాత సభ్య దేశాలు ముఖ విలువకు బాండ్లు చేసే అధికారాన్ని ఇయు సభ్య దేశాలకు కేంద్ర బ్యాంకు కల్పించింది.
ఈ నిర్ణయంతో పలు దేశాల్లో అమల్లో ఉన్న వడ్డీరేట్లు ఒకేస్థాయికి చేరాయి. బలహీన దేశాల ప్రభుత్వ బాండ్లతో బ్యాంకులన్నీ నిండిపోయాయి. ఈ పరిణామమే ఆర్థిక అసమతుల్యతకు కారణమైందని సోరోస్ తెలిపారు. యూరప్‌లో బలమైన దేశమైన జర్మనీ ఈ అసమతుల్యతల భారాన్ని భరించాల్సివచ్చిందని, దీనితో కఠినమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.

0 comments:
Post a Comment