Tuesday

ఎయిడ్స్‌పై యుద్ధానికి సర్వం సిద్ధం ఇక మనుషులపై హెచ్ఐవీ టీకా ప్రయోగాలు ఏడాదిన్నరలోగా అందుబాటులోకి...


వైద్య రంగానికే సవాలుగా నిలిచిన హెచ్ఐవీ భూతాన్ని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది. హెచ్ఐవీని నియంత్రించే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలు.. త్వరలో వాటిని మనుషులపై ప్రయోగాత్మంగా పరిశీలించనున్నారు. సబ్ సహరన్ ఆఫ్రికా సహా ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్న హెచ్ఐవీ వైరస్ జన్యు పరివర్తిత రూపం 'క్లాడ్ సీ'ని ఈ వ్యాక్సిన్ సమర్థంగా ఎదుర్కోగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు 18 నుంచి 45 ఏళ్ల వయస్సు మధ్యగల 36 మంది మహిళలను ఎంపిక చేశారు. మనుషులపై ప్రయోగం ఫలితాలను పూర్తిగా విశ్లేషించడానికి ఏడాది పడుతుందని, ఆ తర్వాత కొద్ది కాలానికే ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని వారు చెబుతున్నారు.

0 comments:

Post a Comment