Wednesday

వార్తా ప్రతికపై కక్షగట్టిన ఛత్తీస్‌గఢ్


ఛత్తీస్‌గఢ్‌లో 'పత్రిక' అనే వార్తా పత్రిక నడవకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తూ భయపెడుతోందని ఇండియన్ న్యూస్ సొసైటీ (ఐఎన్ఎస్) మంగళవారం ఆరోపించింది. పత్రికపై ప్రభుత్వ దాడిని ఖండిస్తున్నట్లు ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ ఆశిష్ బగ్గా తెలిపారు. సీఎం రమణసింగ్, ఆయన బంధువులు కక్ష కట్టి పత్రికను అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే పత్రికకు వ్యతిరేకంగా 40 నుంచి 50 కేసులు నమోదయ్యాయని..
ఎక్కువగా గిరిజన ప్రాంతమైన బస్తర్ జిల్లాకు చెందినవేనని ఆయన చెప్పారు. అంతే కాకుండా అధికార పార్టీ కార్యకర్తలు పత్రిక ప్రతులను దగ్ధం చేస్తూ.. హోర్డింగ్‌లను తొలగిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని చెప్పారు. రమణ్‌సింగ్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతూ విద్వేషపూరితంగా వ్యవహరిస్తోందని.. పత్రికా స్వేచ్ఛ కు భంగం కలిగించడం మంచి పద్దతి కాదని ఆశిష్ బగ్గా అన్నారు.
సంపాదకీయం రాయని మణిపూర్ పత్రికలు తీవ్రవాద సంస్థల బెదిరింపులను నిరసిస్తూ మంగళవారం మణిపూర్‌లోని అన్ని వార్తా పత్రికలు సంపాదకీయం రాయకుండా ఖాళీగా వదిలిపెట్టాయి. తమ వార్తలు ప్రచురించకుండా ప్రత్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నారని కొన్ని తీవ్రవాద సంస్థలు స్థానిక మీడియాపై బెదిరింపులకు పాల్పడుతున్నాయని ఆల్ మణిపూర్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఏఎమ్‌డబ్ల్యుజేయు) అధికారప్రతినిధి తెలిపారు.
ఏకంగా ఓ ఉగ్రవాద సంస్థ సోమవారం ఒక ప్రముఖ దినపత్రిక కార్యాలయ ఆవరణలో శక్తివంతమైన గ్రెనేడ్‌ను పాతిపెట్టడమే కాకుండా.. సంపాదకులకు ఇదే ఆఖరి హెచ్చరిక అంటూ లేఖ వదిలివెళ్ళిందని తెలిపారు. మరోసారి గ్రెనేడ్ బాంబులను పేల్చేస్తామని హెచ్చరించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దయచేసి తమ పనిని స్వేచ్ఛగా చేసుకోనివ్వాలని కోరారు.

0 comments:

Post a Comment