Tuesday

ముఖమే పాస్‌వర్డ్...


మీ స్మార్ట్ ఫోన్లోనో, ట్యాబ్లెట్ పీసీలోనో ఉన్న సమాచారాన్ని ఎవరూ చూడకుండా పాస్‌వర్డ్ పెడు తున్నారా? ఓపెన్ చేసినప్పుడల్లా ఆ పాస్‌వర్డ్ కొట్టడానికి విసుగ్గా ఉందా? మీ విసుగు త్వరలోనే దూరం కానుంది. ఎందుకంటే.. వాడేవారి మొహాన్ని గుర్తుపట్టి, ఆటోమేటిగ్గా లాక్ ఓపెన్ అయిపోయేలా సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. 

ఆ దిశగా ఆపిల్ కంపెనీ తను రూపొందించిన 'ఫేస్ రికగ్నిషన్ (ముఖాలను గుర్తుపట్టే) సాఫ్ట్‌వేర్'కు పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది కూడా. భవిష్యత్తులో తాము విడుదల చేసే ఐఫోన్, ఐపాడ్‌లన్నింటిలో దీనిని పొందు పరుస్తామని ఆపిల్ ప్రకటించింది. 

ఇక.. గూగుల్ సంస్థ తమ ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లలో ఈ 'ఫేస్ రికగ్నిషన్' టూల్‌ను ఇప్పటికే ప్రవేశపెట్టింది. అయితే.. మనుషుల ముఖం మాత్రమే కాదు.. వారి ఫొటోలను ఫోన్‌కు ఎదురుగా పెట్టినా, లాక్ ఓపెన్ అవుతోందని ఆండ్రాయిడ్ ఫోన్లపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి.

0 comments:

Post a Comment