అనంతర కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు ఆయన సన్మానించారు. పద్మవిభూషణ్ ఎంఎస్ స్వామినాధన్, పద్మవిభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, పద్మభూషణ్ ఎస్ఎస్ బద్రీనాధ్, పద్మశ్రీ విజయ్ అమృతరాజ్, పద్మశ్రీ అరుణాసాయిరాం, పద్మశ్రీ డాక్టర్ వి శాంతా, అనితాగుహన్, జి శ్రీనివాసన్‌లను ప్రణబ్ సన్మానించారు. ఇండియన్ బ్యాంక్ నూతన ప్రధాన కార్యాలయం ప్రారంభం ఇండియన్ బ్యాంక్ నూతన ప్రధాన కార్యాలయాన్ని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ టిఎం బాసిన్, రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ కెసి చక్రవర్తి , కేంద్ర విజిలెన్స్ కమిషనర్ జెఎం గార్గ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ.. బ్యాంకింగ్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువ చేయాలన్నారు.
అంచనాలకు మించి విత్తలోటు ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన దానికన్నా అధిక స్థాయిలో విత్తలోటు నమోదయ్యే ఆస్కారం ఉందని ప్రణబ్ అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా 2008-09లో విత్తలోటు 6.5 శాతానికి పెరిగింది. 2009-10లో ఇది 4.5 శాతానికి తగ్గింది. అయితే దురదృష్ట వశాత్తు ఈ ఏడాదిలో విత్తలోటు ఇంతకన్నా అధిక స్థాయిలో ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయని ప్రణబ్ చెప్పారు. ఇక్కడ శుక్రవారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రణబ్ మాట్లాడారు. విత్తలోటును జిడిపిలో 4.6 శాతానికే పరిమితం చేయాలని బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని ప్రణబ్ గుర్తు చేశారు. ఈసారి ఇంతకన్నా ఎక్కువ విత్తలోటే నమోదయ్యే ఆస్కారం ఉందన్నారు.
0 comments:
Post a Comment