Friday

ముబారక్‌కు మరణశిక్షే సబబు


సుమారు 800మంది మరణానికి కారకుడైన ఈజిప్ట్ మాజీ నియంత హోస్నీ ముబారక్‌కు మరణశిక్ష విధించాల్సిందేనని ప్రాసిక్యూషన్ లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రజాఉద్యమంలో భాగంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపించిన హోస్నీ ముబారక్ శిక్షార్హుడేనని వారు వాదించారు. 

గత కొన్ని రోజులుగా జరుగుతున్న వాదనలు గురువారం కూడా కొనసాగాయి. ముబారక్‌తోపాటు అతడి హయాంలోని సెక్యూరిటీ చీఫ్ సహా ఆరుగురికి కూడా మరణ శిక్ష విధించాలని కోరారు. గత జనవరిలో తలెత్తిన ప్రజాఉద్యమాన్ని అణచివేయడానికి ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో సుమారు 800మంది మరణించారని, దీనికి ముబారక్‌దే బాధ్యత అని ఆరోపిస్తూ కేసు దాఖలైన విషయం తెలిసిందే.

0 comments:

Post a Comment