నిందితుడు ఇచ్చే వాంగ్మూలం ఆధారంగానే సహ నిందితుడి దోషత్వాన్ని నిర్ధారించలేమని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అంబదాస్ జోషి రూలింగ్ ఇచ్చారు. " ఇతర సాక్ష్యాల ఆధారంగా సహ నిందితుడిపై విచారణ చేపట్టినప్పుడు నిందితుడి వాంగ్మూలాన్ని సహాయకారిగా ఉపయోగించుకోవచ్చు.
అయితే.. ఒక్క అతడి వాంగ్మూలమే శిక్ష విధించడానికి పునాది కాజాలదు'' అని వివరించారు. అంతేకాదు, ఇలాంటి కేసులు చేపట్టడం వల్ల కోర్టు, ప్రభుత్వ న్యాయవాదుల విలువైన సమయం వృధా కావడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారం కూడా అవుతుందని, నేరశిక్షాస్మృతి వ్యవస్థకు అపకీర్తి కొని తెస్తుందని వ్యాఖ్యానించారు.
చీటింగ్, దొంగతనం కేసుల్లో తనను అనవసరంగా సహనిందితుణ్ణి చేశారన్న ప్రవీణ్ కల్మేగ్ విజ్ఞాపనకు స్పందించి కేసు నుంచి విముక్తుణ్ణి చేశారు.

0 comments:
Post a Comment