Tuesday

అమీర్ ఖాన్ సినిమా కొత్త రికార్డు...!


  బాలీవుడ్ ని 'ఖాన్ త్రయం' పాలిస్తున్న కాలమిది. ఎటు తిరిగి ఎటొచ్చీ షారుఖ్, ఆమీర్, సల్మాన్ ఖాన్ల మధ్యే పోటీ నడుస్తుంటుంది. ఇటీవల షారుఖ్ నటించిన 'డాన్ -2' సినిమా ధియేటర్ రైట్స్ 80 కోట్లకి అమ్ముడుపోయి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రికార్డుని అమీర్ ఖాన్ సినిమా అధిగమించింది. అమీర్ హీరోగా కరీనా కపూర్, రాణి ముఖర్జీ హీరోయిన్లుగా నటించిన 'తలాష్' సినిమా ధియేటర్ హక్కుల్ని రిలయన్స్ సంస్థ 90 కోట్లకు టోకుగా కొనేసింది. అంటే, షారుఖ్ 'డాన్ -2' సినిమా కంటే 10 కోట్లు ఎక్కువన్న మాట. అయితే, ఇదేమీ పెద్ద ఎక్కువ రేటు కాదనీ, 'తలాష్' సినిమాకు ఆ అర్హత వుందనీ బాలీవుడ్ బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. అన్నట్టు, 'తలాష్' జూన్ లో రిలీజ్ కానుంది.

0 comments:

Post a Comment