1. ఇద్దరు ఉద్యోగులలో ఒకరు 2002 సంవత్సరంలో ప్రమోషన్ పొందగా అతని వేతనము యఫ్.ఆర్. 22 (ఎ) (ఱ) ప్రకారము స్థిరీకరించబడినది. ఆ తదుపరి తేది 1-2-2009న స్పెషల్ గ్రేడు స్కేలు కూడా మంజూరైనది. కాగా జూనియర్‌కు 16 సంవత్సరాల స్కేలు మంజూరు తదుపరి తేది 20-5-2011న ప్రమోషన్ ఇవ్వబడినది. ప్రమోషన్ పోస్టు స్కేలులో అతని వేతనము యఫ్.22బి ప్రకారము స్థిరీకరించబడినందున జూనియర్ వేతనము ఎక్కువగాను, సీనియర్ వేతనము తక్కువగాను వున్నది. అయితే జూనియర్ స్కేలు తక్కువగాను, సీనియర్ స్కేలు ఎక్కువగాను వున్నది. అట్టి సందర్భములో సీనియర్ స్టెపప్ పొందుటకు అవకాశం ఉన్నదా? -వై.కిరణ్, సిరిసిల్ల, కరీంనగర్‌జిల్లా.
2010 వేతన సవరణ స్కేళ్లలో ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంటు స్కేళ్లకు సంబంధించి ఇచ్చిన జి.ఓ.93 నందు సీనియర్, జూనియర్ వేతన స్టెప్‌అప్ వర్తింపజేయుటకు విధించిన షరతులలో ''సీనియర్, జూనియర్ ఒకే వేతన స్కేలులో వుండాలి'' అనే షరతు మీరు పేర్కొన్న సీనియర్ వేతనమును స్టెప్‌అప్ చేయుటకు అడ్డంకిగా వున్నది. అయితే సీనియర్ వేతన స్కేలు ఎక్కువగా నున్న సందర్భములోను సీనియర్, జూనియర్ వేతన వ్యత్యాసమును సవరించడం సహజ న్యాయసూత్రాలకు అనుగుణమైనది గనుక ఆ మేరకు సవరణ ఉత్తర్వులు పొందుటకు ఉద్యోగ సంఘాలు ప్రాతినిద్యం చేయవలసి వున్నది.
2. ఒక ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో జూన్ 1989లో రికార్డు అసిస్టెంట్‌గా నియమించబడిన నేను సెప్టెంబర్ 1991లో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొదాను. 2007లో 16 సంవత్సరాల స్కేలు తీసుకొన్నాను. 52 సంవత్సరాల వయసుగల నేను ఏ టెస్టులూ పాస్‌కాలేదు. 18 సంవత్సరాల స్కేలు పొందే అవకాశం వున్నదా? నేను తప్పనిసరిగా పాస్ కావలసిన టెస్టులేమైనా వున్నాయా? -ఆర్. మురళి, శ్రీకాకుళం.
రికార్డు అసిస్టెంట్‌గా నియమించబడిన ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందిన మీదట సీనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందాలన్నా, లేక 16 సం||ల స్కేలు పొందాలన్నా సంబంధిత పార్టుమెంటల్ టెస్టులు పాస్ కావలసి వుంటుంది. ఎందుకనగా ఉద్యోగి సర్వీసుకాలంలో కనీసం ఒక ప్రమోషన్ పొందుటకుగాను అతనికి 45 సంవత్సరాల వయసు నిండి తేది డిపార్ట్‌మెంటల్ టెస్టులనుండి మినహాయింపు వర్తిస్తుందని జి.ఓ.యం.యస్.నెం.225 జిఎడి శాఖ, తేది 18-5-1999 నందు స్పష్టముగా పేర్కొనబడినది. కాగా 18 సంవత్సరాల స్కేలు పొందుటకు ఎట్టి అదనపు టెస్టులూ పాస్ కావలసిన అవసరం లేదు. 18 సంవత్సరాల సర్వీసు నిండిన మరుసటి రోజున 16 సంవత్సరాల స్కేలులోనే ఒక ఇంక్రిమెంటును కలుపుతారు.
3. మా కారుణ్యలయాధిపతి ''మీ విధులపట్ల ఉపేక్ష, అశ్రద్ధలతో వ్యవహరిస్తున్నారు గనుక మీపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకొనకూడదో సంజాయిషీ ఇవ్వండి'' అని మా సహచర ఉద్యోగికి నోటీసు ఇచ్చారు. ఈ అభియోగములతో సదరు ఉద్యోగిపై ఏ రకమైన క్రమశిక్షణగా చర్యలు తీసుకొనుటకు అవకాశమున్నది? -ఎ. నర్సింహం, సంగారెడ్డి.
మీరు పేర్కొన్న విధముగా సంజాయిషి నోటీసు ఇచ్చివుంటే, అందులో పేర్కొనిన అభియోగములలో స్పష్టత లేదు గనుక నేను స్పష్టమైన సంజాయిషీ ఇచ్చు కొనలేక పోతున్నారు.'' అని సదరు ఉద్యోగి కార్యాలయాధిపతికి తెలియజేసుకొనుటకు అవకాశం వున్నది. ఉద్యోగిపై మోపబడిన అభియోగములో స్పష్టత వున్నప్పుడు మాత్రమే సి.సి.ఎ. నిబంధనల మేరకు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనుటకు వీలున్నది. సదరు విషయమై జి.ఓ.680 జిఎడి శాఖ తేది 01-11-2008 ద్వారా ఇచ్చిన వివరణ ఉత్తర్వులను పరిశీలించండి?
0 comments:
Post a Comment