ఆంధ్రప్రదేశ్ పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజనీర్స్ పోస్టులైన ఎలక్ట్రికల్-295, మెకానికల్-100, ఎలక్ట్రానిక్స్-30, సివిల్-67 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులలో బిఇ/బిటెక్ పాసై ఉండాలి.
వయసు: 34 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే పంపాలి.
దరఖాస్తుల దాఖలుకు చివరితేదీ: 2012 జనవరి 3.
రాతపరీక్ష: 2012 జనవరి 22.
వివరాలకు:http//apgenco.gov.in చూడండి.
ఎపి ట్రాన్స్‌కోలో
ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజనీర్స్ పోస్టులు విశాఖ పట్నంలో- ఎలక్ట్రికల్-42, టెలికామ్-2, విజయవాడలో- ఎలక్ట్రికల్-41, టెలికాం-3, కడపలో-ఎలక్ట్రికల్-40, టెలికామ్-9, హైదరాబాద్ మెట్రోలో-ఎలక్ట్రికల్-18, టెలికామ్-4, హైదరాబాద్ రూరల్‌లో- ఎలక్ట్రికల్-59, టెలికామ్-4, వరంగల్‌లో ఎలక్ట్రికల్-25, టెలికామ్-3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులలో బిఇ/బిటెక్/ఎఎంఐఇ పాసై ఉండాలి.
వయసు: 34 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే పంపాలి.
దరఖాస్తుల దాఖలుకు చివరితేదీ: 2012 జనవరి 18.
వివరాలకు:www.aptransco.cgg.gov.inచూడండి.
ఆర్‌సిఎఫ్‌లో
రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మేనేజ్‌మెంట్ ట్రయినీ-24 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: అగ్రికల్చరల్ బిఎస్‌సి, ఎంబిఎ మార్కెటింగ్/బిఎకస్‌సి బయో టెక్నాలజీ, ఎంబిఎ మార్కెటింగ్ ఉండాలి.
దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలి.
దరఖాస్తుల దాఖలుకు చివరితేదీ: 2012 జనవరి 12.
వివరాలకు: www.rcfld.com చూడండి.
ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో
ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, అంబజ్‌హరీ, నాగపూర్ స్టోర్‌కీపర్-26, ఫైర్‌మెన్-3, దుర్వాన్-24 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: స్టోర్ కీపర్‌కు ఇంటర్మీడియట్, మిగిలిన పోస్టులకు పదవ తరగతి పాసై ఉండాలి.
వయసు: 27 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలి.
దరఖాస్తుల దాఖలుకు చివరితేదీ: 2012 జనవరి 9.
వివరాలకు:www.ofajadmin.com
ఇండియన్ కోస్ట్‌గార్డు
ఇండియన్ కోస్ట్‌గార్డ్ నావిక్ (జనరల్ డ్యూటీ), డొమెస్టిక్ బ్రాంచ్ (కుక్ అండ్ స్టీవార్డ్) పోస్టుల భర్తీనిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: నావిక్ పోస్టులకు 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పాసై ఉండాలి.
డొమిస్టిక్ బ్రాంచ్‌కు 50 శాతం మార్కులతో పదవ తరగతి పాసై ఉండాలి.
దరఖాస్తుల దాఖలుకు చివరితేదీ: 2012 జనవరి9.
0 comments:
Post a Comment