Monday

9,10 తేదీల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సుల కౌన్సిలింగ్ (B.sc nursing counselling)


బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల కోర్సులో ప్రవేశానికి ఈ నెల 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి అనుబంధ కళాశాలల్లో 60:40 చొప్పున సీట్ మ్యాట్రిక్స్‌ను తయారుచేసి సీట్లు కేటాయించనున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించాక హైకోర్టు నుంచి తదుపరి ఉత్తర్వుల మేరకు సీట్ల కేటాయింపు ఆధారపడి ఉంటుందన్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌లో మాత్రమే కౌన్సెలింగ్ జరుగుతుందని చెప్పారు. 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 1- 2500 ర్యాంక్ వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2501-5000 ర్యాంక్ వరకు, 10 తేదీ ఉదయం 9 గంటలకు 5001 నుంచి చివరి మెరిట్ ఆర్డర్ వరకు అన్ని ర్యాంక్‌ల వారికి కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు.

0 comments:

Post a Comment