Monday

విద్యా చట్టంపై ముస్లిం లాబోర్డు ధ్వజం


కేంద్ర ప్రభుత్వం చేసిన విద్యా హక్కు చట్టాన్ని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బో ర్డు (ఏఐఎంపీఎల్‌బీ) తీవ్రంగా దుయ్యబట్టింది. మదర్సాలతో సహా మైనారిటీ సంస్థలన్నీ దీని మూలంగా తమ అస్తిత్వాన్ని కోల్పోతాయని బోర్డు కార్యదర్శి మౌలానా మొహమద్ వలీ రహ్మానీ ఆందోళన వ్యక్తం చేశారు.

మైనారిటీల హక్కులు పరిరక్షిస్తున్న రాజ్యాంగంలోని 30వ అధికరణానికి, కొత్త చట్టం పూర్తి విరుద్ధంగా ఉన్నదని పే ర్కొన్నారు. మైనారిటీలు తమకు నచ్చిన తీరులో, రీతిలో విద్యను పొందే హక్కును 30వ అధికరణం దఖలు పరుస్తుండగా.. ఇందుకు విరుద్ధంగా, విద్యకు సంబంధించిన ప్రతి అంశాన్నీ కొత్త చట్టం నిర్దేశిస్తోందని విమర్శించారు.

0 comments:

Post a Comment