ఎటుచూసినా తెల్లటి మంచు.. కళ్లు చెదిరేలా! పైకి కనిపించే అంటార్కిటికా రూపమిదే! కానీ.. దాని అడుగున పర్వతాలున్నాయి, లోయలున్నాయి. విమానాలు, ఉపగ్రహాలు, ఓడలు.. చివరకు స్లెడ్జ్(కుక్కల బండ్లు)పై ఆ ప్రాంతంలో పయనించిన పరిశోధకులు ఇచ్చిన వివరాలతో శాస్త్రజ్ఞులు వాటన్నిటి గురించి పూర్తిస్థాయి వివరణాత్మక మ్యాప్‌నొకదాన్ని రూపొందించామని ప్రకటించారు. 'బెడ్ మ్యాప్' పేరిట దాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అందులో.. అంటార్కిటికా రాక్‌బెడ్‌పైగల పర్వత శిఖరాలను ఎరుపు, నలుపు రంగుల్లో సూచించారు.
అతితక్కువ ఎత్తుల్ని ముదురు నీలి రంగుతోను, భూఖండాన్ని లేత నీలిరంగుతోను సూచించారు. ఇన్నివర్ణాల మయమైన ఆ మ్యాపే అద్భుతంగా ఉంటే నిజంగా ఆ ప్రాంతం ఇంకెం త బాగుంటుందోనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే చూడటానికి ఇంత అందంగా ఉన్నా.. భూ తాపం ప్రభావం అంటార్కిటికాపై ఎలా పడుతుందో ఈ మ్యాప్‌ద్వారా అర్థమవుతోందని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
భూతాపం ప్రభావం ఇప్పటికే అంటార్కిటికా అంచుల వద్ద ప్రస్ఫుటమవుతోందని, అక్కడి మంచు భారీగా కరిగి సముద్రంలో కలిసిపోతోందని పేర్కొన్నారు. తద్వారా అంతర్జాతీయంగా సముద్రజల మట్టాలు పెరిగిపోతాయని వారు హెచ్చరిస్తున్నా రు. ఈ ప్రక్రియ ఎంతవేగంగా జరుగుతుందనేది తాము రూపొందించిన బెడ్ మ్యాప్‌ద్వారా తెలుసుకోవచ్చని వారు భావిస్తున్నారు.

0 comments:
Post a Comment