పాక్‌పై అమెరికా మాజీ సైనికాధికారి హెచ్చరిక
వాషింగ్టన్, అమెరికా, బ్రిటన్లు కలిసి పాకిస్తాన్‌ను ఏళ్ల తరబడి పెంచి పోషించాయని సర్వత్రా అనుమానాలున్నాయి. అవి వాస్తవమని అమెరికన్ మాజీ సైనికాధికారి ఒకరు వెల్లడించారు. దశాబ్దాల తరబడి పాకిస్తాన్‌కు అమెరికా ఆయధాలు సరఫరా చేయగా, ఇప్పుడు వాటినే పాక్ అగ్రరాజ్యం మీద ప్రయోగిస్తానంటూ బెదిరిస్తోందని 'మెడల్ ఆప్ ఆనర్ అవార్డును అందుకున్న డకోటా మయర్ చెబుతున్నారు. అఫ్గాన్ యుద్ధంలో పని చేసిన మయర్ బీఏఈ సిస్టమ్స్ అనే ఆయుధ తయారీ సంస్థలోనూ పని చేశారు. తాను అఫ్గాన్‌లో పని చేసిన రోజుల్లో మిత్రదేశమని అమెరికా భావించే పాక్ వర్గాలతోనే పోరాడాల్సి రావడాన్ని మయర్ బయటపెట్టారు. తమ సంస్థ తయారు చేస్తున్న థర్మల్ ఆప్టిక్ స్కోప్‌లను పాక్‌కు సరఫరా చేయడంపై ఆయన తన పై అధికారులతో విభేదించారు. ఈ స్కోప్‌లను పాక్‌కు సరఫరా చేయడం వలన అఫ్గాన్‌లో పోరాడుతున్న అమెరికా దళాలకు ప్రమాదమని మయర్ వివరించారు. అమెరికన్ సైనికులను చంపుతున్న వారికే అత్యాధునిక పరికరాలను తమ సంస్థ అమ్ముతోందని ఆయన విమర్శించారు. అమెరికా సహా ఇతర నాటో దేశాల దళాలన్నీ పాక్‌ను శత్రువ్ఞగా చూస్తున్నా, తమ దేశాల్లోని రాజకీయ కారణాల వలన మిన్నకుంటున్నారని తెలిపారు. ఈ అసంతృప్తి తీవ్రమైన కారణంగానే పాక్ సైనిక స్థావరాలపై నాటో దళాలు దాడులు జరపాయని మయర్ అభిప్రాయం. దీన్ని ఉద్దేశపూర్వకంగా చేసిన రెచ్చగొట్టే దాడిగా పాక్ అభివర్ణించినా, వాస్తవానికి అఫ్ఘాన్ నుంచి పారిపోయిన ఉగ్రవాదులు పాక్‌లో ప్రవేశించి తిరిగి వచ్చి, అమెరికన్లపై దాడులు చేస్తున్నారన్నది ఆయన వాదన. గతంలోనూ తాలిబన్లపై నాటో దళాలు జరిపిన దాడిలో పాక్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ అధికారులు మరణించిన విషయాన్ని మయర్ గుర్తు చేశారు. అసలు అఫ్గాన్‌పై అమెరికా దాడి తరువాత కొందరు ఉగ్రవాదులను పాక్ తమ దేశంలోకి క్షేమంగా తీసుకెళ్లిందని ఆయన వెల్లడించారు. ఉగ్రవాదులపై పోరు కోసమని చెప్పి సేకరించిన ఆయుధాలను భారత్‌పై పాక్ గురిపెట్టిందని అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే, ఇప్పుడు వాటిని అమెరికన్ సైనికులపైనా పాక్ గురిపెట్టడంతో అగ్రరాజ్యానికి మింగుడు పడడం లేదు.
0 comments:
Post a Comment