శరీరంలోని వివిధ అవయవాలనుంచి రక్తస్రావం గురించి అవగాహన కలిగితే, ఆ సమస్య తీవ్ర మైనదా? కాదా? తెలుస్తుంది. ప్రస్తుతం చెవుల నుంచి రక్తం కారడం గురించి తెలుసుకుందాం.
చెవులనుంచి రక్తస్రావమవడం అరుదుగా జరుగు తుంది. ఎప్పుడైనా ఎవరికైనా చెవినుంచి ఒకటి రెండు చుక్కలు రక్తం వెలువడితే దాని గురించి హైరానా పడనక్కరలేదు. చెవి లోపలి మార్గాన్ని చుట్టి ఉండే చర్మం ఇరిటేట్ అయిన ప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంది.
అయితే చెవినుంచి ఎక్కువగా రక్తస్రావమవు తుంటే తేలికగా తీసుకోకూడదు. ఇది ప్రమాదకర మైన లక్షణం. చెవులనుంచి రక్తస్రావమవుతున్న ప్పుడు దాని తీవ్రతను అంచనా వేయడానికి ఈ కింది అంశాలు దోహదపడుతాయి.
చెవి తిమ్మెను తాకితే నొప్పిగా అనిపిస్తుందా?
చెవి మార్గాన్ని బిగుతుగా అమరి ఉండే ఒక చర్మపు పొర చుట్టి ఉంటుంది. ఇక్కడ ఏదైనా చిన్న కురుపు వంటిది తయారైతే, దానిలో ఉండే ద్రవాంశం లోపలికి వెళ్లడానికి స్థలం లేక, బైటకు పోవడానికి వీలు లేక తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.
ఒకవేళ ఇదిపగిలితే నాలుగైదు రక్తపు చుక్కలు కనిపించవచ్చు. దీనికి చిన్నపాటి శస్త్రచికిత్స చేసి లోపల ఉన్నచీమును తొలగించాల్సి ఉంటుంది. ఈ సమస్య ఉత్పన్నమైనప్పుడు నొప్పి, వాపు తగ్గడానికి త్రిఫల గుగ్గులు, శారిబాదివటి వంటి మందులు పని చేస్తాయి.
చెవి లోపల దురదగా ఉందా?
చెవిలోపల మార్గాన్ని కప్పి ఉంచే చర్మంపైన ఎగ్జిమా వంటి చర్మవ్యాధి సోకితే దురదతోపాటు కొద్దిపాటి రక్తస్రావం కూడా కనిపించే అవ కాశం ఉంది. క్షారతైలం ఈ తరహా సమస్యలకు చక్కని మందు.
రక్తం కనిపించే ముందు తీవ్రమైన చెవిపోటు వచ్చిందా?
కొన్ని సందర్భాలలో హఠాత్తుగా మొదలయ్యే ఇన్‌ఫెక్షన్లు కర్ణభేరిని ఛిద్రం చేసి రక్తస్రావానికి కారణమవుతాయి.
పిల్లలలో ఈ తరహా సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమస్య ఏర్పడినప్పుడు ఒకవేళ రంధ్రం చిన్నదైతే దానంతట అదే పూడుకుపోయిన మానుతుంది. కాకపోతే రంధ్రం త్వరగా మానడానికి గుగ్గిలంతో ధూపనం వేయాల్సి ఉంటుంది.
చెవిలో రంధ్రం పడినప్పుడు ఎట్టి పరిస్థితు ల్లోనూ ద్రవాంశాలను ఔషధ రూపంలో వాడకూ డదు. ఇవి రంధ్రం ద్వారా అభ్యంతర కర్ణంలోనికి ప్రవేశించి కొత్త సమస్య లను సృష్టించే అవకాశం ఉంది.
లౌడ్ స్పీకర్లలోనుంచి వచ్చే పెద్ద శబ్దాలను దగ్గర నుంచి విన్నారా?
పెద్దపెద్ద విస్ఫో టనాలు, లౌడ్‌స్పీకర్ల శబ్దాల వంటివి వినడం, స్విమ్మింగ్ పూల్‌లో డైవ్ చేయడం, విమానయా నం చేయడం (ముఖ్యంగా ల్యాండింగ్) - ఇటువంటి వాటి వలన కర్ణభేరికి ఇరుపక్కలా ఉండే ఒత్తిడిలో మార్పు వచ్చి కర్ణభేరి పగిలి రక్తస్రావమయ్యే అవకాశం ఉంది.
ఆయుర్వేదం వ్యాధులు కలగడానికి కారణా లను ఉటంకిస్తూ అయోగం, అతియోగం, మిథ్యాయోగం గురించి చెబుతుంది. అతియోగ మంటే దేనినైనా అతిగా చేయడం. పెద్ద శబ్దాలను వినడం వల్ల వచ్చే ఇలాంటి ఇక్కట్లు అతి యోగం కిందకు వస్తాయి.
తలకు దెబ్బ తగిలినా...
తలకు బలమైన దెబ్బ తగిలి తల ఎముకలు ఫ్రాక్చర్ అయితే చెవులనుంచి విపరీతంగా రక్త స్రావమయ్యే అవకాశం ఉంది. దీనిని అనుసరించి స్పృహ కూడా తప్పవచ్చు.
దీనికి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చికిత్సచేయాలి. లేకపోతే ప్రాణానికి ప్రమాదం వాటిల్లవచ్చు.
|
0 comments:
Post a Comment